ఇదేందయ్యా ఇది.. క్రిస్మస్ బోనస్‌గా ఉద్యోగినికి ఆలుగడ్డ ఇచ్చిన కంపెనీ..

సాధారణంగా యజమానులు ఉద్యోగులకు బోనస్ రూపంలో జీతానికి సమానమైన డబ్బులు, లేదంటే జీతానికి మించిన డబ్బులు అందిస్తుంటారు.కానీ ఒక ఉద్యోగినికి మాత్రం యజమాని ఉడకబెట్టిన ఆలుగడ్డ ఇచ్చి చేతులు దులుపుకున్నాడు.

 The Company Gave A Potato To The Employee As A Christmas Bonus , Christmas Bonus-TeluguStop.com

సోషల్ మీడియా ( Social media )ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో సదరు ఉద్యోగిని ఇదే విషయాన్ని ఓ పోస్ట్ ఆన్‌లైన్‌లో షేర్ చేయడం ద్వారా వెల్లడించింది.తన యజమానులు తనకు క్రిస్మస్ బోనస్‌గా బేక్డ్‌ పొటాటో ఇచ్చిందని, దానిపై పన్ను కూడా చెల్లించాలని ఆమె నిట్టూర్చింది.

ఎక్స్‌లో అమండా బి అనే పేరుతో ఉన్న మహిళ ఇలా ట్వీట్ చేస్తూ.“నా వర్క్ కంపెనీ క్రిస్మస్ బోనస్‌గా బంగాళాదుంప( Potato )ను ఇచ్చింది.ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, నేను బోనస్‌గా ఒక హాస్పటల్ పొటాటో పొందాను.దాని విలువ 15 డాలర్లు అని వారు చెబుతున్నారు.అంటే నెక్స్ట్ చెక్‌పై పన్ను వర్తిస్తుంది.ఈ జాబ్ చేయలేను ఎవరైనా అసిస్టెంట్ కావాలంటే నేను చేరిపోతాను.” అని ఆమె తన అసహనాన్ని వెళ్లగెక్కింది.

పొటాటో బార్ బఫెట్ అని ఆమె వివరించింది, ఇక్కడ ఉద్యోగులు బంగాళాదుంప కోసం వారి స్వంత టాపింగ్స్‌ను ఎంచుకోవచ్చు.ఈ గిఫ్ట్ తనను ఆకట్టుకోలేదని, ఇది ఆలోచనాత్మకంగా ఇచ్చిన బహుమతి కాదని ఆమె చెప్పింది.దానిని మునుపటి సంవత్సరం బోనస్‌( Christmas bonus )తో పోల్చింది.

ఆన్‌లైన్‌లో బోనస్‌లు ఇచ్చి ఉన్నతాధికారులు సంబంధించి తప్పించుకుంటున్నారని ఆమె ఆరోపించింది.ఆమె ట్వీట్ లో బంగాళాదుంప పిక్ కూడా పోస్ట్ చేసింది, బోనస్‌తో తాను అవమానంగా, నిరుత్సాహానికి గురయ్యానని చెప్పింది.ఆమె పోస్ట్ ఎక్స్‌లో వైరల్ అయింది, 2.7 మిలియన్లకు పైగా వ్యూస్, వేలకొద్దీ కామెంట్స్ వచ్చాయి.ఆమె పరిస్థితిపై పలువురు సానుభూతి, ఆగ్రహం వ్యక్తం చేశారు.కొందరు యజమానుల నుంచి నిరాశపరిచే బోనస్‌లు లేదా బహుమతుల గురించి వారి సొంత అనుభవాలను పంచుకున్నారు.మరికొందరు మంచి ఉద్యోగం కోసం ట్రై చేయాలని ఆమెను ప్రోత్సాహాన్ని అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube