సీతారామం సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో మీకు తెలుసా?

జులై నెలలో థియేటర్లలో విడుదలైన ప్రతి సినిమా భారీ అంచనాలతో విడుదలై డిజాస్టర్ ఫలితాన్ని సొంతం చేసుకుంది.వరుస ఫ్లాపుల వల్ల నిర్మాతలకు, బయ్యర్లకు భారీగా నష్టాలు రావడంతో పాటు నిర్మాతలలో టెన్షన్ మొదలైంది.

 Star Hero Vijay Devarakonda Rejected Seetharamam Movie Details Here ,  Dulquer S-TeluguStop.com

అయితే కొత్తదనంతో సినిమాలను తెరకెక్కిస్తే సినిమాలు సక్సెస్ సాధిస్తాయని బింబిసార, సీతారామం సినిమాల ఫలితాలు ప్రూవ్ చేశారు.దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం కాదు.

దుల్కర్ తెలుగులో నటించిన సినిమాలలో మహానటి మినహా మరే సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు.అయినప్పటికీ సీతారామం సినిమాకు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన సీతారామం సినిమా ఫుల్ రన్ లో 25 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

అయితే సీతారామం కథను మొదట విని ఈ సినిమాను వదులుకున్న హీరో ఎవరనే ప్రశ్నకు విజయ్ దేవరకొండ పేరు సమాధానంగా వినిపిస్తోంది.

ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటం, తనకు కథ సూట్ కాదని అనిపించడం వల్ల విజయ్ దేవరకొండ ఈ సినిమాను వదులుకుని ఉండవచ్చని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.దుల్కర్ సల్మాన్ మాత్రం లెఫ్టినెంట్ రామ్ పాత్రకు పర్ఫెక్ట్ ఛాయిస్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Telugu Bimbisara, Dulquer Salmaan, Mahanati, Mrinal Thakur, Seetharamam-Movie

సీతారామం సక్సెస్ తో తెలుగులో దుల్కర్ సల్మాన్ కు సినిమా ఆఫర్లు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు.మృణాళ్ ఠాకూర్ కు సైతం సౌత్ నుంచి ఆఫర్లు పెరిగే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మృణాళ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.రష్మిక తన పాత్ర ద్వారా ఈ సినిమా సక్సెస్ విషయంలో కీలక పాత్ర పోషించారనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube