సాధారణంగా మొసలికి మాంసం అంటే ఇష్టం.మరి అలాంటి మొసలికి మనిషి కనిపిస్తే అది వదిలిపెట్టదు.
ఆ మనిషిని తన ఆహారం చేసుకుని లొట్టలేసుకుంటూ తినేస్తుంది.అయితే జూలలో పెంచే కొన్ని మొసళ్లు అంత ప్రమాదకరంగా ఉండవు.
వాటికి ట్రైనింగ్ ఇస్తారు.కాబట్టి అవి మనుషులను తినవు.
జూలోని మొసళ్లకు ఇచ్చే ట్రైనింగ్ వలన అవి మనుషులపై దాడి చేయవని తెలుసుకోవాలి.అయితే మొసలి జూలో ఉన్నా, బయట ఉన్నా దాని సహజ గుణం అదే కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.
మనిషి కనిపిస్తే మొసళ్లు అటాక్ చేయడం సహజమే అని అందరూ తెలుసుకోవాలి.తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.
ఆ వీడియో మొసలి స్వభావం ఎలా ఉంటుందనేది తెలియజేస్తుంది.ఒళ్లు గగుర్పొడిచే ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది.
తాజాగా ఓ జూలో మొసలిని ప్రదర్శనకు పెట్టారు.మొసలి బాధ్యతలు ఓ మహిళా ట్రైనర్ కు ఇచ్చారు.ఆ మహిళా ట్రైనర్ మొసలికి చేతితో ఏదో ఆహారం ఇస్తుండగా ఆ మొసలి మాత్రం ఆహారంతో పాటు వెంటనే ఆ మహిళ చేతిని కూడా పట్టుకుంది.నోటితో ఆ చేతిని కరుచుకొని ఒక్కసారిగా ఆ మహిళా ట్రైనర్ ను నీటిలోకి లాగేసుకుంది.
అంతటితో ఆగకుండా ఆ మొసలి ఆ మహిళను గిర్రున తిప్పేసి నానా ఇబ్బందిని కలగజేసింది.

మహిళా ట్రైనర్ మొసలి నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ మొసలి మాత్రం వదలకుండా అలానే చేతిని నోట కరుచుకునే ఉంది.దీంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి లోపలికి ప్రవేశించి మొసలి నుంచి ఆ మహిళా ట్రైనర్ ను కాపాడాడు.అతన్ని కూడా కొద్దిసేపు ఆ మొసలి ఇబ్బంది పెట్టింది.
కొద్దిసేపటికి ఆ మొసలిని అతను అదుపులోకి తెచ్చాడు.ఆ తర్వాత అక్కడి నుంచి వారిద్దరూ బయటకు వచ్చేశారు.
దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి సందడి చేస్తోంది.