దానిమ్మ పండు సాగులో బ్యాక్టీరియల్ ముడత ను అరికట్టే పద్ధతులు..!

దానిమ్మ పండుకు( Pomegranate fruit ) గాయాలైన, సహజ రంధ్రాలు ఏర్పడిన వాటి ద్వారా బ్యాక్టీరియా లోపలికి ప్రవేశిస్తుంది.శీతాకాలంలో అయితే ఈ బ్యాక్టీరియా పండ్ల లోపల, కాండంపై, ఆకులపై నివసిస్తుంది.

 Methods To Prevent Bacterial Blight In Pomegranate Cultivation , Pomegranate Cu-TeluguStop.com

కలుషితమైన కత్తిరింపులు చేస్తే ఈ బ్యాక్టీరియా( Bacteria ) కచ్చితంగా పంటను ఆశిస్తాయి.దానిమ్మ పండ్లకు బ్యాక్టీరియా సోకినప్పుడు ముందుగా పసుపు రంగులో వృత్తాకార మచ్చలు ఏర్పడి, పండ్లపై పగుళ్లు ఏర్పడతాయి.

తర్వాత క్రమంగా చెట్టు యొక్క ఆకులు రాలిపోతాయి.ఈ మచ్చలు క్రమంగా ముదురు గోధుమ రంగులోకి మారిన తర్వాత కాండం, కొమ్మలకు వ్యాప్తి చెంది కణజాలాలను నాశనం చేస్తాయి.

దీంతో దానిమ్మ పండు నలుపు రంగులోకి మారుతాయి.

Telugu Agriculture, Bacterial, Basil Leaf, Latest Telugu, Neem Seed Oil, Pomegra

దానిమ్మ పంట సాగు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ముందుగా ఆరోగ్యవంతమైన మొలకలను ఎంచుకోవాలి.ఇక పొలం పరిశుభ్రంగా ఉంచుకోవాలి.ముఖ్యంగా పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.

ఏవైనా మొక్కలకు గాయాలయితే ఆ మొక్కకు కచ్చితంగా కత్తిరింపులు జరపాలి.పరిశుభ్రమైన పనిముట్లతో మాత్రమే మొక్కలకు కత్తిరింపులు జరపాలి.

ఒకవేళ బ్యాక్టీరియా సోకిన మొక్కలకు కత్తిరింపులు జరిపిన తర్వాత శుభ్రం చేయకుండా ఇతర మొక్కలకు కత్తిరింపులు జరపకూడదు.

Telugu Agriculture, Bacterial, Basil Leaf, Latest Telugu, Neem Seed Oil, Pomegra

ఇక మొదట సేంద్రియ పద్ధతిలో బ్యాక్టీరియా నివారణ చర్యలు చేపట్టాలి.వేప ఆకులను ఆవు మూత్రంలో 24 గంటలు నానబెట్టి ఆ తర్వాత మొక్కల యొక్క కొమ్మలు, ఆకులు పూర్తిగా తడిచేతట్లు పిచికారి చేయాలి.40% తులసి ఆకు రసం( Basil leaf juice ), శాతం వేప గింజల నూనె( Neem seed oil ) కలిపి పిచికారి చేయాలి.ఇంకా కావాలంటే వెల్లుల్లి, తుమ్మకాండం, పట్చౌలి ఆకుల రసాన్ని 30% సాంద్రతతో కలిపి పంటకు పిచికారి చేయాలి.సేంద్రీయ పద్ధతిలో నీవారించడం కష్టం అయితే రసాయనిక పిచికారి మందులైన కాపర్ ఆక్సి క్లోరైడ్ 50.0%, ధనుకొప్ 50%wp లలో ఏదో ఒక దానిలో లీటరు నీరు కలిపి పంటకు పిచికారి చేసి సంరక్షించుకుంటే నాణ్యత గల దిగుబడి పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube