భారత క్రికెటర్లలో అత్యంత దురదృష్టవంతులైన క్రికెటర్లు వీళ్లే..!

క్రీడల విషయానికొస్తే భారత్ లో క్రికెట్ కు ఉన్నంత క్రేజ్ మరో క్రీడకు లేదు.అందుకే బీసీసీఐ ( BCCI )నిర్వహించే ఐపీఎల్ ఏ రేంజ్ లో ఆదరణ పొందుతుందో తెలిసిందే.

 These Are The Most Unlucky Cricketers Among Indian Cricketers, Indian Cricketer-TeluguStop.com

ఎంతోమంది ప్రతిభ ఉన్న యువతీ,యువకులు క్రికెట్ లో రాణించడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు.రాత్రింబవళ్లు కష్టపడి తమ ప్రతిభను చాటితేనే భారత జట్టులో చోటు దక్కే అవకాశాలు కలిసి వస్తాయి.

ప్రతిభ ఉన్న అదృష్టం కలిసి రాకపోతే కెరియర్ ముగిసినట్టే.కొంతమంది తమలో ఎంతో ప్రతిభ ఉన్నా కూడా అదృష్టం కలిసి రాక పోవడంతో క్రికెట్ కు దూరమైన దురదృష్టవంతులు ఎవరో తెలుసుకుందాం.

అంబటి రాయుడు: ( Ambati Rayudu )ప్రతిభ ఉండి కూడా అదృష్టం కలిసి రాకపోవడంతో క్రికెట్ కు దూరమైన దురదృష్టవంతుల జాబితాలో ముందు వరసలో ఉన్నాడు.2019 ప్రపంచ కప్ కు ముందు జరిగిన మ్యాచ్లో తన సత్తా ఎంతో నిరూపించుకున్న కూడా సెలక్టర్లు రాయుడును దూరం పెట్టేశారు.పలువురు ఆటగాళ్లు గాయాల కారణంగా క్రికెట్ కు దూరంగా ఉన్న సమయంలో స్టాండ్ బై ప్లేయర్ గా ఉన్న రాయుడును సెలెక్టర్లు జట్టులోకి తీసుకోకపోవడంతో చివరకు అంతర్జాతీయ క్రికెట్ కు అంబటి రాయుడు వీడ్కోలు పలికాడు.

Telugu Ambati Rayudu, Dinesh Karthik, Irfan Pathan, Karan Nair, Latest Telugu, W

కరణ్ నాయర్: ( Karan Nair )2016లో కరణ్ నాయర్ ఇంగ్లాండ్ గడ్డపై ట్రిపుల్ సెంచరీ చేసిన భారత క్రికెట్ చరిత్రలో రెండవ బ్యాటర్ గా సరికొత్త రికార్డు సృష్టించాడు.ఇతనికి ప్రతిభ ఉంది కానీ అదృష్టం కలిసి రాలేదు.ఆ తరువాత నాయర్ కు భారత జట్టులో చోటు దక్కలేదు.

Telugu Ambati Rayudu, Dinesh Karthik, Irfan Pathan, Karan Nair, Latest Telugu, W

వసీమ్ జాఫర్: భారత క్రికెట్లో స్టైలిష్ ఆటగాడిగా, ది లెజెండ్ ఆఫ్ డొమెస్టిక్ క్రికెట్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇతను 186 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో ముంబై తరపున ఆడుతున్న సమయంలో 14,609 పరుగులు చేశాడు.ప్రతిభ ఉన్న కూడా ప్లేయర్ రొటేషన్స్ మారుతూ ఉండడంతో అవకాశాలు రాలేదు.

Telugu Ambati Rayudu, Dinesh Karthik, Irfan Pathan, Karan Nair, Latest Telugu, W

ఇర్ఫాన్ పఠాన్: ( Irfan Pathan )పాకిస్తాన్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఓవర్ లోనే హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి రికార్డ్ సృష్టించాడు.క్రికెట్ లో ఇతనికి జూనియర్ కపిల్దేవ్ గా గుర్తింపు వచ్చింది.అయితే చాపెల్ భారత జట్టుకు కోచ్ గా మారిన తర్వాత పఠాన్ ను బలవంతంగా ఆల్ రౌండర్ చేసే ప్రయత్నం చేశాడు.

పఠాన్ రెండిటిని సమానంగా కొనసాగించడంలో తడబడి జట్టులో స్థానం కోల్పోయాడు.

Telugu Ambati Rayudu, Dinesh Karthik, Irfan Pathan, Karan Nair, Latest Telugu, W

దినేష్ కార్తీక్:( Dinesh Karthik ) దేశవాళి క్రికెట్ లో ఎన్నో అద్భుతాలు సృష్టించిన ఇతను భారత జట్టులో స్థిరమైన స్థానం పొందలేకపోయాడు.భారత జట్టులో గంగూలీ, సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఉండడంతో దినేష్ కార్తీక్ ఎక్కువగా అవకాశాలు రాలేదు.ధోని వికెట్ కీపర్ గా ఉండడంతో ప్రతిభ ఉన్న కూడా దినేష్ కార్తీక్ దురదృష్టం వెంటాడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube