హీరోయిన్ సెంటిమెంట్ ను పక్కన పెట్టేస్తున్న స్టార్ డైరెక్టర్స్!

సాధారణంగా ఇండస్ట్రీలో కొంత మంది సెంటిమెంట్స్ ను బాగా ఫాలో అవుతూ ఉంటారు.ఏదైనా కాంబో సక్సెస్ ఫుల్ అయితే దానిని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు.

 These Directors Stop Their Sentiment, Trivikram Srinivas, Gopichand Malineni,-TeluguStop.com

అలా డైరెక్టర్లు, హీరోలు తమకు నచ్చిన వారిని సెంటిమెంట్ గా భావిస్తూ రిపీట్ చేస్తూ ఉంటారు.మరి మన టాలీవుడ్ లో ఇద్దరు స్టార్ డైరెక్టర్లు సెంటిమెంట్ గా హీరోయిన్ లను రిపీట్ చేస్తుంటారు.

Telugu Poojaa Hegde, Shruti Haasan, Directors-Movie

కానీ ఈ సెంటిమెంట్ కొన్ని సినిమాలకు మాత్రమే ఉపయోగించారు.ఇప్పుడు ఈ ఇద్దరు డైరెక్టర్లు కూడా ఈ సెంటిమెంట్ ను పక్కన పెట్టినట్టు తెలుస్తుంది.మరి ఆ డైరెక్టర్లు ఎవరంటే త్రివిక్రమ్ శ్రీనివాస్, గోపీచంద్ మలినేని( Trivikram Srinivas ).ఈ ఇద్దరు డైరెక్టర్లు కూడా తమ సినిమాల్లో హీరోయిన్ లను రిపీట్ చేస్తుంటారు.కానీ ఇప్పుడు అదే సెంటిమెంట్ ను పట్టుకుని వేలాడితే కష్టం అని తెలుసుకున్నట్టు ఉన్నారు.

Telugu Poojaa Hegde, Shruti Haasan, Directors-Movie

అందుకే తమ లేటెస్ట్ ప్రాజెక్టుల్లో వీరు హీరోయిన్ లను రిపీట్ చేయడం మానేసి క్రేజ్ ఉన్న వారికీ అవకాశం ఇచ్చారు.గోపీచంద్ మలినేని తన సినిమాల్లో ఎప్పుడు శృతి హాసన్ ను మాత్రమే తీసుకోవాలని ట్రై చేస్తాడు.కానీ ఈయన ఈ సెంటిమెంట్ ను ఇన్నాళ్లకు పక్కన పెట్టాడు.

అతి త్వరలోనే రవితేజతో స్టార్ట్ చేయనున్న సినిమాకు పూజా హెగ్డేను తీసుకున్నట్టు తెలుస్తుంది.ఇక త్రివిక్రమ్ కూడా మహేష్ బాబుతో చేస్తున్న గుంటూరు కారం( Guntur karam ) సినిమా కోసం ముందు ఎలాంటి ఆలోచన లేకుండానే పూజా హెగ్డేను తీసుకున్నాడు.

అయితే ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ రావడంతో పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఈమె కాకుండా శ్రీలీల హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.పూజాను టీమ్ తొలగించిందో లేదంటే ఆమె తప్పుకుందో మాత్రం తెలియదు.

ఇలా ఈ డైరెక్టర్లు ఎట్టకేలకు హీరోయిన్ లను మార్చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube