అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని బీజేపీ ధర్నా

నల్లగొండ జిల్లా:అర్హులైన పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ నందు ధర్నా నిర్వహించారు.బీజేపీ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి( Kankanala Sridhar Reddy ) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జి పి.

 Bjp Dharna To Give Double Bedroom Houses To All The Deserving Poor , Bjp Dharna-TeluguStop.com

మురళీధర్ రావు ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ అర్హులైన పేద ప్రజలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలైనా రాష్ట్రంలో కానీ,నల్గొండ జిల్లాలో కానీ, ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదన్నారు.మళ్లీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్న సందర్భంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని బీసీ బంధు,మైనార్టీ బంధు,దళిత బంధు, గిరిజన బంధు అని మాయమాటలు చెబుతూ ఉచిత హామీలు ఇస్తుందని విమర్శించారు.

ఇచ్చిన హామీలు అమలు చేయడం బీఆర్ఎస్ పార్టీకి అలవాటు లేదని ఎద్దేవా చేశారు.రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇచ్చి గెలిపించండి,డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడగానే అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మరియు రేషన్ కార్డులు,పెన్షన్లు, ఉద్యోగాల భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాధగోని శ్రీనివాస్ గౌడ్,జిల్లా ఇన్చార్జి ప్రదీప్ కుమార్,గోలి మధుసూదన్ రెడ్డి,వీరెల్లి చంద్రశేఖర్,బండారు ప్రసాద్,పల్లెబోయిన శ్యాంసుందర్,కన్మంత రెడ్డి శ్రీదేవి రెడ్డి,వర్షిత్ రెడ్డి, పోతేపాక సాంబయ్య, నూకల వెంకటనారాయణ రెడ్డి,కంకణాల నివేదిత రెడ్డి,లాలు నాయక్,రిక్కల ఇంద్రసేనారెడ్డి,రవి నాయక్,సాదినేని శ్రీనివాస్, రతన్ సింగ్,దాయం భూపాల్ రెడ్డి,కౌన్సిలర్లు, రాష్ట్ర,జిల్లా,మండల పట్టణ,వివిధ మోర్చాల నాయకులు,శక్తి కేంద్ర ఇన్చార్జీలు,బూత్ అధ్యక్షుల,కార్యకర్తలు, మహిళలు,డబుల్ బెడ్ రూమ్ కు అర్హులైన పేదలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube