ప్రస్తుత యువత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వారికి ఇష్టమొచ్చినట్లు కొంతమంది బహిరంగ ప్రదేశాలలో ప్రవర్తిస్తూ ఉంటారు.
ముఖ్యంగా బడికి వెళ్లి చదువుకోవాల్సిన వయసులో లవర్స్ అంటూ ఇష్టం వచ్చినట్లు తిరిగేవారు.అలాగే కాలేజీలలో చదివే వారు కూడా వారికి ఇష్టం వచ్చినట్లు వారు బహిరంగ ప్రదేశాలలో ప్రవర్తిస్తూ ఉన్నారు… పెళ్లి కంటే ముందే స్నేహం, ప్రేమ ముసుగులో చేయకూడని పనులన్నీ చేసేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో కొంతమంది యువతీ యువకులు బహిరంగ ప్రదేశాలైన బస్టాండ్లో రైల్వేస్టేషన్ లో, మెట్రో స్టేషన్లలో పాడు పనులు చేయడం మొదలుపెట్టేశారు.ఇప్పటి వరకు ఎక్కువగా ఇలాంటి సంఘటనలు ఢిల్లీ, ముంబై మెట్రో (Delhi, Mumbai Metro)నగరాలలో చోటు చేసుకుంటూ ఉంటే.
తాజాగా హైదరాబాద్లో(Hyderabad) కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతుంది.

తాజాగా హైదరాబాద్ నగరంలోని చైతన్య పూరి (Chaitanya Puri)నుంచి మెట్రో లైన్ ఎల్బీనగర్(Metro Line LB Nagar) కు వస్తున్న క్రమంలో ఒక ప్రేమ జంట(Love couple) బహిరంగ ప్రదేశంలో ఉన్నామని మరిచిపోయి మరీ ముద్దులు పెట్టుకోవడంలో మునిగి పోయారు.అందరూ చూస్తుండగానే ముద్దులు పెట్టుకుంటున్నారు.అయితే ఇదంతా అక్కడ ఉన్న వారిలో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.అది కాస్త వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.ఇక ఈ వైరల్ వీడియోలో చూసిన నెటిజన్స్ వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు .కొంతమంది వాళ్ళు చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే.మరికొందరు ఎమోజిలతో కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరేమేమో ఇలాంటి వారిని గుర్తించి మరోసారి ఇలాంటి చర్యలు చేప్పట్ట కుండా ఉండేలా పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని కామెంట్స్ చేస్తున్నారు.







