కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తిరుమలలో కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు చెప్పారు.
రెండు రాష్ట్రాల్లో ఎక్కువ నిధులు తీసుకువచ్చిన ఎంపీని తానేనని తెలిపారు.తెలంగాణలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉందన్న ఆయన అప్పటివరకు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెడతానని పేర్కొన్నారు.
నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు పని చేయాలని సూచించారు.షర్మిల వాహనాన్ని క్రేన్ తో లాక్కెళ్లడం బాధ కలిగించిందని కోమటిరెడ్డి వెల్లడించారు.