మూడు రోజుల్లో తొమ్మిది సినిమాల రిలీజ్ డేట్స్..2021 అంతా?

కరోనా కారణం వల్ల తెలుగు సినీ పరిశ్రమ బోసిపోయింది.ఈ వైరస్ కారణంగా సినిమా షూటింగ్ లన్ని ఆగిపోవడంతో థియేటర్ల ముందు పండగ వాతావరణం కనిపించలేదు.

అయితే తాజాగా సినిమాలు చిత్రీకరణ జరుపుకుని ఒక్కొక్క సినిమా విడుదల అవుతుండటంతో అటు చిత్ర పరిశ్రమ సినిమాల చిత్రీకరణలో నిమగ్నమయ్యారు.అంతే కాకుండా దాదాపు సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఒక సినిమాను మించి మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

తాము నిర్మించిన సినిమాలకు మరే ఇతర సినిమాలు పోటీ రాకూడదనే ఉద్దేశంతో సినిమా విడుదల తేదీలను సంవత్సరం ముందు నుంచి దర్శక నిర్మాతలు విడుదల తేదీలను తెలియజేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో ఇతర సినిమా దర్శకులు అందరూ వారి సినిమాల విడుదల తేదీలను వరుసగా ప్రకటిస్తూ వచ్చారు.

ఈ విధంగా సినిమా తేదీల విడుదలను దర్శకనిర్మాతలు ప్రకటించడంతో కేవలం మూడు రోజుల వ్యవధిలోనే దాదాపు తొమ్మిది సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.అంతేకాకుండా ఈ ఏడాది సినిమాలన్నీ పోటీపడుతూ విడుదల కావడంతో ఈ సంవత్సరం సినిమా జాతర లా ఉంటుందని చెప్పవచ్చు.అయితే మూడు రోజులలో విడుదల అయ్యే 9 సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.1) గోపీచంద్ హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన సిటీ మార్ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కానుంది.2) వేణు ఉడగల దర్శకత్వంలో, రానా, సాయి పల్లవి జంటగా నటిస్తున్న విరాటపర్వం ఏప్రిల్ 30 న విడుదల కానుంది.3) వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ తరహా నేపథ్యంలో దర్శకుడు కొర్రపాటి తెరకెక్కిస్తున్న గని జూలై 30 విడుదల కానుంది.4) కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ ఆచార్య సినిమా ఈ ఏడాది వేసవి సెలవులలో రానుంది.5) సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ పుష్ప సినిమా ఆగస్టు 13న విడుదల కానుంది.6) వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్ 3 ఆగస్టు 27 న విడుదల కానుంది.7) రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.8) తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన అన్నాథై నవంబర్ 4న విడుదల కానుంది.9) పరశురామ్ దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారీ వారి పాట 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలియజేశారు.

Advertisement
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

తాజా వార్తలు