జగన్ ఒకవైపు.. మిగతా వాళ్లంతా మరోవైపు.. ఎన్నికల యుద్ధంలో వైసీపీ గెలుస్తుందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు మరో 4 రోజుల సమయం మాత్రమే ఉంది.ఎన్నికల సమయానికి ఏ పార్టీకి అనుకూలంగా పరిస్థితులు మారతాయో అనే చర్చ జరుగుతోంది.

 War Oneside In Ap Politics Details Here Goes Viral In Social Media , Social Medi-TeluguStop.com

జగన్(jagan) ఒకవైపు మిగతా ప్రధాన నేతలంతా మరోవైపు ఉండటంతో ఎన్నికల యుద్ధంలో వైసీపీ(YCP) గెలుస్తుందా? అనే చర్చ జరుగుతోంది.వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే ఏ అవకాశాన్ని కూటమి వదులుకోకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

జగన్ ప్రకటించిన మేనిఫెస్టో కంటే కూటమి మేనిఫెస్టో అద్భుతంగా ఉన్నా ఆ మేనిఫెస్టో అమలు సాధ్యం కాని మేనిఫెస్టో(Manifesto) అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.అయితే ప్రజలు ఏ మేనిఫెస్టోను నమ్ముతారో కచ్చితంగా చెప్పలేము.

ఈసారి కుటుంబాలలోనే క్రాస్ ఓటింగ్ ఎక్కువగా జరగనుందని తెలుస్తోంది.భార్యాభర్తలు ఒకే పార్టీకి ఓటు వేసే ఛాన్స్ తక్కువగా ఉందని సమాచారం అందుతోంది.

Telugu Ap, Chandrababu, Jagan, Manifesto-Politics

మహిళల్లో ఎక్కువమంది జగన్(jagan) కే మద్దతు ఇస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.సూపర్ సిక్స్ అమలు సాధ్యం కాదని జగన్ లెక్కలతో సహా చెబుతున్న సంగతి తెలిసిందే.చంద్రబాబు(Chandrababu) చెప్పిన స్కీమ్స్ అమలు చేయాలంటే 1,65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది.చంద్రబాబు ఈ స్కీమ్స్ ను ఎలా అమలు చేస్తారో ఇప్పటికీ చెప్పడం లేదు.

Telugu Ap, Chandrababu, Jagan, Manifesto-Politics

చంద్రబాబు నాయుడు సంపద సృష్టించడం అనేది కల్ల అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసినా తన పాలనను చూసి ఓట్లు వేయండని చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు.చంద్రబాబు, జగన్(Chandrababu, Jagan) లలో ఎవరికి అధికారం దక్కుతుందో చూడాలి.ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ రాజకీయ నేతల్లో సైతం టెన్షన్ పెరుగుతుండటం గమనార్హం.ఈ ఎన్నికల్లో పోటాపోటీ అనేలా పరిస్థితులు ఉండబోతున్నాయని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube