వారంలో 2 సార్లు ఈ రెమెడీని పాటిస్తే మొటిమలు మచ్చలు పోయి ముఖం తెల్లగా మెరుస్తుంది!

సాధారణంగా కొందరికి ముఖం మొత్తం మొటిమలు మచ్చలు( Acne scars ) ఏర్ప‌డుతుంటాయి.ఇవి చాలా అసహ్యం కనిపిస్తాయి.

 Follow This Remedy To Get Rid Of Acne Scars And Make Your Face Glow White! Acne-TeluguStop.com

అద్దంలో ముఖాన్ని చూసుకున్న ప్రతిసారి మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తాయి.ఈ క్రమంలోనే మొటిమలను, మచ్చలు వదిలించుకునేందుకు ర‌క‌ర‌కాల క్రీములు, సీర‌మ్‌లు వాడుతుంటారు.

క్లియ‌ర్ స్కిన్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.

మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక గ్లాస్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్‌ గ్రీన్ టీ పౌడ‌ర్ ( Green tea powder )మ‌రియు చిన్న కప్పు వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత‌ మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్( Oats ) వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ పౌడర్ వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ నీమ్ పౌడర్,( Neem powder ) పావు టేబుల్ స్పూన్ పసుపు మరియు సరిపడా గ్రీన్ టీ వేసుకుని బాగా మిక్స్ చేసి పోవాలి.

Telugu Acne, Acne Skin, Tips, Remedyrid, Skin, Remedy, Latest, Skin Care, Skin C

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే ముఖంపై ఎంత‌టి మొండి మొటిమ‌లు ఉన్నా పరార్ అవుతాయి.

అలాగే మ‌చ్చ‌లు క్ర‌మంగా మాయం అవుతాయి.ముఖ‌ చర్మం తెల్లగా మృదువుగా మారుతుంది.కాంతివంతంగా మెరుస్తుంది.

Telugu Acne, Acne Skin, Tips, Remedyrid, Skin, Remedy, Latest, Skin Care, Skin C

అంతేకాదు ఓట్స్‌, నీమ్ పౌడ‌ర్‌, గ్రీన్ టీ మ‌రియు ప‌సుపులో ఉండే పలు సుగుణాలు చ‌ర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి.ఏజింగ్ ను ఆల‌స్యం చేస్తాయి.కాబ‌ట్టి మొటిమలు మచ్చలు లేని తెల్లటి మెరిసే చర్మాన్ని కోరుకునేవారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube