ప్రస్తుతం వేసవి కాలం( summer season ) కొనసాగుతున్న సంగతి తెలిసిందే.రోజురోజుకు ఎండలు ముదిరిపోతున్నాయి.
అయితే వేసవి కాలంలో అత్యధికంగా వేధించే సమస్యల్లో సన్ టాన్ ఒకటి.ఎండల్లో బయట గంట తిరిగారంటే చాలు దెబ్బకు చర్మం నల్లగా మారుతుంది.
అయితే అలా నల్లగా మారిన చర్మాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలో తెలియక చాలామంది మదన పడుతుంటారు.అందుకు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.
ఈ రెమెడీని పాటిస్తే ఎండల వల్ల నల్లగా మారిన చర్మం చాలా వేగంగా రిపేర్ అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు బియ్యం( rice ) వేసి వాటర్ తో కడిగి ఒక కప్పు వాటర్ పోసి నానబెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి.
అలాగే ఒక కప్పు పచ్చి పాలు( raw milk ), ఒక కప్పు టొమాటో ముక్కలు( Tomato slices ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe vera gel ), మూడు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్, హాఫ్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ జ్యూస్ ను ఐస్ ట్రేలో నింపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.ఇలా తయారు చేసుకున్న ఐస్ క్యూబ్స్ ను తీసుకుని చర్మంపై స్మూత్ గా రబ్ చేసుకోవాలి.ఆపై చర్మాన్ని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకుని అప్పుడు వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేస్తే ఎండల దెబ్బకు నల్లగా మారిన చర్మం రిపేర్ అవుతుంది.మళ్ళీ స్కిన్ పూర్వ స్థితికి వస్తుంది.సన్ టాన్ సమస్యను నివారించడానికి ఏ రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.
చర్మంపై మొండి మచ్చలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.