ప్రముఖ సినీ నటుడు, జనసేన నేత నాగబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.పవన్ యాత్రలు చేసే సమయంలో మేము తీసుకునే సెక్యూరిటీ మేము తీసుకుంటామని ప్రభుత్వం ఏ స్థాయిలో రక్షణ ఇస్తుందో ప్రభుత్వం ఇష్టమని ఆయన తెలిపారు.
రోడ్ షోలు చేయకూడదు అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదని నాగబాబు కామెంట్లు చేశారు.పవన్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తే వైసీపీకే నష్టమని ఆయన తెలిపారు.
2024 ఎన్నికల్లో పోటీ చేయాలని నేను భావించడం లేదని అయితే పార్టీ నిర్మాణంలో కీలకంగా ఉండాలని భావిస్తున్నానని నాగబాబు పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ ఆస్తుల గురించి నాగబాబు స్పందిస్తూ తను సంపాదించిన డబ్బులను పర్సనల్ లెవెల్ లో పవన్ హెల్ప్ చేస్తారని, ప్రజల కోసం ఖర్చు చేస్తారని నాగబాబు వెల్లడించారు.
పవన్ తనకు చేతనైనంత డబ్బును ఇచ్చేస్తాడని ఆయన పేర్కొన్నారు.
పవన్ కు సినిమాలు తీయడం ఆపేస్తే ఆయనకు ఎలాంటి ఆదాయం ఉండదని నాగబాబు తెలిపారు.ప్రజల కోసం పోరాడేవారికి ఆస్తులు ఎక్కువగా ఉండకూడదని పవన్ భావిస్తారని నాగబాబు కామెంట్లు చేశారు.శంకర్ పల్లిలో పవన్ కు ల్యాండ్ ఉందని అయితే ఆ ఆస్తి పెద్ద ఆస్తి కాదని ఆయన తెలిపారు.
నాకేం వ్యాపారాలు లేవని నాగబాబు చెప్పుకొచ్చారు.మేము మధ్య తరగతి కుటుంబంలో పుట్టామని ఆయన తెలిపారు.
మెగా ఫ్యామిలీ ఎవరినీ బాధ పెట్టేలా వ్యవహరించదని నాగబాబు తెలిపారు.పళ్లున్న చెట్టుకే రాళ్లు పడతాయని ఆయన చెప్పుకొచ్చారు.నాగబాబు వెల్లడించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.పవన్ కళ్యాణ్ కు 2024 ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వస్తాయని అభిమానులు భావిస్తున్నారు.టీడీపీ జనసేన పార్టీల పొత్తు ఫిక్స్ అయిందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.ఈ వార్తలు నిజమో కాదో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.