మినుము పంటను ఆశించే సీతాఫలం తెగులును నివారించేందుకు చర్యలు..!

మినుము పంట( Black Grain ) తక్కువ పెట్టుబడి వ్యయంతో సాగు చేసే పంట కాబట్టి ఎక్కువగా రెండవ పంటగా రబీలో సాగు చేసేందుకు రైతులు అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు.కాకపోతే ఈ పంటకు కాస్త తెగుళ్ల, చీడపీడల బెడద ఎక్కువ.

 Black Grain Cultivation Methods , Agriculture , Farmers , Investment , Dixoh-TeluguStop.com

సకాలంలో గుర్తించి తొలిదశలో నివారణ చర్యలు చేపట్టి పంటను రక్షించుకుంటే అధిక దిగుబడి సాధించవచ్చు.మినుము పంటకు ఆశించి తీవ్ర నష్టం కలిగించే తెగుళ్లలో సీతాఫలం తెగుళ్లు కీలకపాత్ర పోషిస్తాయి.

తెగుళ్లు ఒక వైరస్ ద్వారా సోకుతాయి.ఈ వైరస్ విత్తనాల ద్వారా వ్యాపిస్తుంది.

మినుము మొలకలను కూడా ఈ తెగులు వ్యాపిస్తుంది.ఈ వైరస్ వల్ల తెగుళ్ల వ్యాప్తి తీవ్రం అవుతుంది.

ఈ తెగుళ్లు పంటను ఆశిస్తే దిగుబడి( Yield ) సగానికి పైగా తగ్గే అవకాశాలు ఉన్నాయి.

Telugu Agriculture, Farmers, Millet Crop, Seeds, Sorghum, Yield-Latest News - Te

సీతాఫలం తెగుళ్లను పంట పొలంలో ఎలా గుర్తించాలంటే.తెగుళ్లు సోకిన మొక్కల ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి.క్రమంగా అవి లేత ఆకుపచ్చ రంగులోకి మారతాయి.

మొక్క కాండం పొట్టిగా, సన్నగా ఉంటూ ఎర్రని రంగులోకి మారుతుంది.ఆ తర్వాత ఆకులకు ముడతలు వచ్చి రాలిపోవడం, ఆకులు గరుకుగా మారడం జరుగుతుంది.

మొగ్గలు ఏర్పడే సమయంలో ఈ తెగుళ్లు సోకితే మొక్కల ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది.

Telugu Agriculture, Farmers, Millet Crop, Seeds, Sorghum, Yield-Latest News - Te

ఈ తెగుళ్లు విత్తనాల ద్వారా సోకే అవకాశం ఎక్కువ కాబట్టి సర్టిఫైడ్ కంపెనీలు ధృవీకరించిన విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి.పొలంలో ఇతర పంటల అవశేషాలు లేకుండా శుభ్రం చేయడంతో పాటు ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు పెరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.పొలం చుట్టూ మొక్కజొన్న, జొన్న లేదా సజ్జలు( Sorghum ) లాంటి మొక్కలు వేయడం వల్ల ఈ తెగుల వ్యాప్తి కాస్త నిరోధించవచ్చు.

పొలంలో ఈ తెగుళ్లను గుర్తించిన తర్వాత డిక్సోహెక్సహైడ్రో ఇమిడాక్లోప్రిడ్, ట్రిఅజైన్ ఉయోగించి ఈ తెగులు ఇతర మొక్కలకు వ్యాపించకుండా అడ్డుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube