కెరీర్ పరంగా సక్సెస్ సాధించి ఉన్నత స్థానాలకు ఎదగాలని భావించే వాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.అయితే ఆర్థిక సమస్యల వల్ల ఈ విషయాలకు సంబంధించి చాలామంది వెనుకడుగు వేస్తూ ఉంటారు.
ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యలోనే చదువుకు దూరమైన వాళ్ల సంఖ్య కూడా తక్కువేం కాదనే సంగతి తెలిసిందే.అయితే ఒక వ్యక్తి మాత్రం ఒకప్పుడు నైట్ వాచ్ మేన్ గా( Night Watchman ) పని చేసి ఇప్పుడు ఐఐఎం ప్రొఫెసర్( IIM Professor ) స్థాయికి ఎదిగారు.
ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీ వింటే నెటిజన్లు సైతం ఫిదా అవుతారు.కేరళకు చెందిన రంజిత్ రామచంద్రన్( Ranjith Ramachandran ) పేద కుటుంబంలో జన్మించారు.శిథిలమైన, పాత పెంకుల గుడిసెలో జీవనం సాగించారు.కొన్నేళ్ల క్రితం రంజిత్ నైట్ వాచ్ మేన్ గా కూడా పని చేశారు.
ఇప్పుడు ఈ వ్యక్తి రాంచీలో ఐఐఎం ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.కేరళలోని పనాతూరుకు చెందిన రంజిత్ రామచంద్రన్ తల్లి దినసరి కూలీ కాగా తండ్రి టైలర్ గా పని చేస్తున్నారు.

రంజిత్ చదువుకునే సమయంలో కుటుంబ పోషణ కష్టం కావడంతో టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ లో నైట్ వాచ్ మేన్ గా పని చేశాడు.విద్యుత్ కు అంతరాయం కలగకుండా చుసూకోవడమే అతని ఉద్యోగం.ఒకవైపు ఈ జాబ్ చేస్తూనే రంజిత్ ఉన్నత విద్యను పూర్తి చేయడం జరిగింది.పీజీ పూర్తయ్యే వరకు రంజిత్ నైట్ వాచ్ మేన్ గా కొనసాగారు.ఐఐటీ మద్రాస్ లో రంజిత్ పీహెచ్డీ చేశారు.

ఐఐఎంలో ప్రొఫెసర్ గా పని చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న రంజిత్ ఆ లక్ష్యాన్ని సాధించారు.కెరీర్ పరంగా సక్సెస్ కావడానికి పేదరికం అడ్డు కాదని రంజిత్ ప్రూవ్ చేశారు.ఇంగ్లీష్ లో ప్రావీణ్యం లేక ఒక దశలో ఇబ్బందులు ఎదురైనా ఆ ఇబ్బందులను ఎదురించి రంజిత్ సత్తా చాటడంతో పాటు ప్రశంసలు అందుకుంటున్నారు.







