వైరల్ అవుతున్న అరియానా డాన్స్ వీడియో.. అది పట్టినట్లుందంటూ నెటిజన్స్ ట్రోల్స్?

కొందరు జనాలు ఎప్పుడూ ఇతరులపై బాగా టార్గెట్ చేస్తూ ఉంటారు.వాళ్ళు ఏది చేసిన విమర్శలు చేస్తూనే ఉంటారు.

 Arianas Dance Video Going Viral Are Netizens Trolling It Ariyana Glory  ,  Dance-TeluguStop.com

ముఖ్యంగా మంచి హోదాలో ఉన్న వారికి మాత్రం ఇటువంటివి బాగా ఎదురవుతూ ఉంటాయి.సిని సెలెబ్రేటీలకు కూడా ఇటువంటి విమర్శలు తగులుతూ ఉంటాయి.

చాలావరకు సెలబ్రెటీలలో అందర్నీ కాకుండా బాగా ఓవర్ చేసే కొంతమందిని మాత్రమే బాగా ఆడుకుంటారు.ఒకప్పుడు వారు ఏమి చేసినా కూడా వారిని విమర్శలు చేయడానికి అవకాశాలు లేకుండేవి.

కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఖాతాలు అందుబాటులో ఉండటం వల్ల ఎప్పటికప్పుడు మనసులో మాటను బయట పెట్టేస్తున్నారు నెటిజన్స్.సెలబ్రిటీలను మాత్రం అస్సలు వదలడం లేదు.

వాళ్ళు చేసే ప్రతి పోస్టుకు ఏదో ఒక ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు.ముఖ్యంగా టాలీవుడ్ బుల్లితెరపై పలువురు ఆర్టిస్టులు బాగా ట్రోలింగ్స్ ఎదుర్కొంటారు.

అందులో అషురెడ్డి, అనసూయ, అరియానా ఇలా పలువురు సెలబ్రిటీలు మొదటి లిస్టులో ఉన్నారు.ఒక వీళ్ళు ఏమి చేసినా అది వెంటనే ట్రోలింగ్స్ అవుతుంది.

తాజాగా మరోసారి అరియానా ట్రోలింగ్స్ ఎదుర్కొంది.ఇంతకూ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

యూట్యూబ్ యాంకర్ గా పరిచయమైన అరియానా ఇప్పుడు ఈ క్రేజ్ కు రావడం కారణం రామ్ గోపాల్ వర్మ అని అందరికీ తెలిసిందే.గతంలో ఆయనతో ఓ బోల్డ్ ఇంటర్వ్యూ చేయటం వల్ల ఆ సమయంలో అందరి దృష్టిలో పడింది.

దీంతో ఆమెకు రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా అవకాశం వచ్చింది.హౌస్ లోకి వచ్చాక ఈమె చేసిన రచ్చ చాలా ఓవర్ గా అనిపించింది.

ఆ సమయంలో తన పరిచయాన్ని మరింత పెంచుకుంది.ఇక ఈ షో తర్వాత ఈమెకు బాగా కలిసి వచ్చింది.

యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ తో పాటు యాంకరింగ్ ని కూడా కంటిన్యూ చేసింది.అంతేకాకుండా బుల్లితెరపై పలు షోలల్లో కూడా చేసింది.

ప్రస్తుతం బిబి డాన్స్ షోలో కూడా పాల్గొంది.మొత్తానికి ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది అరియానా.

సోషల్ మీడియాలో కూడా నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.

అషురెడ్డితో మరోసారి నాన్ స్టాప్ బిగ్ బాస్ లో అవకాశం అందుకున్నప్పుడు తనతో పరిచయం పెరగడం వల్ల బాగా క్లోజ్ అయ్యింది.ఇక ఆమె లా పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తూ ఈమె కూడా బాగా రెచ్చిపోతుంది.తన అందాలను అన్ని బయటపెట్టేసింది.

దీంతో ఈమెకు నెగటివ్ కామెంట్స్ కూడా ఎదురయ్యాయి.  ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తాను ఒక డాన్స్ వీడియో ని షేర్ చేసుకుంది.

అయితే అందులో ఆమె డాన్స్ చేయటం కంటే ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేసిన విధానం కనిపించింది.ఆ వీడియో చూసిన నెటిజన్స్ డాన్స్ కంటే ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేస్తున్నావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.మరి కొంతమంది కూడా బాగా ట్రోల్స్ చేస్తున్నారు.ఓ నెటిజన్ మాత్రం దయ్యం పట్టినట్లుంది అంటూ ట్రోల్ చేశారు.ఇక మొత్తానికి అరియానాకు  డాన్స్ రాకున్నా కూడా ప్రయత్నంలో వెనుకాడటం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube