సినిమా ఇండస్ట్రీలో ఒక వ్యక్తి సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగాడు అంటే ఆయన వెనక చాలా కష్టం ఉందని అర్థం.ఇక్కడ కష్టపడకుండా ఎవరూ ఎదగలేరు.
అయితే ఈ సినిమా ఇండస్ట్రీలో చాలామంది చాలా రకాలుగా కష్టాలు పడుతూ వాళ్లకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇలాంటి సందర్భంలో అందరూ సక్సెస్( Success ) కోసమే చాలా కష్టపడుతూ ఉంటారు.
కొంతమందికి సక్సెస్ అనేది ఓవర్ నైట్ లో వచ్చేస్తే మరి కొంతమందికి సక్సెస్ రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది.

కానీ అదే జీవితం అనుకొని బతుకుతున్న వాళ్లకి తప్పకుండా ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది.ఇక అందుకోసమే చాలామంది ఇండస్ట్రీ ని నమ్ముకొని బతుకుతూ ఉంటారు.ఇక ఈ విషయం అంత ఎందుకు అంటే ఓవర్ నైట్లో స్టార్ హీరో అయిపోయినా విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆ తర్వాత చేసిన గీతగోవిందం సినిమా కూడా మంచి సక్సెస్ అయినప్పటికీ ఆ తర్వాత వరుసగా ఫ్లాపులు రావడంతో మనోడు స్టార్ హీరోల రేంజ్ ని అందుకోలేకపోతున్నాడు.

ఇక ఇది ఒకటి అయితే ఇంకోటి ఏదైనా సినిమా ఫంక్షన్స్ లో మనోడు ఆటిట్యూడ్ చూపిస్తూ మాట్లాడటం చూసిన జనాలకి విజయ్ ఆటిట్యూడ్( Vijay Devarakonda Attitude ) నచ్చక పోవడం వల్ల కూడా ఆయన కొంతమంది ఫ్యాన్స్ ని కోల్పోవాల్సి వస్తుంది.ఆయన హీరో అవ్వడానికి చాలా కష్టపడ్డాడు కానీ ఇలా ఆటిట్యుడ్ చూపించడం వల్ల తన ఫ్యాన్స్ అనుకునేవాళ్లు కూడా తనకి దూరంగా వెళ్లిపోవడం జరుగుతుంది.అందుకే ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగినట్టు ఉండాలి అనేది రాజమౌళి ని( Rajamouli ) చూసి నేర్చుకోవాలి.
ప్రస్తుతం ఆయన ఫ్యాన్ వరల్డ్ డైరెక్టర్ అయిన కూడా ఆయన ఎంత హుందాగా ఉంటాడు అలాగే తన పని తను చేసుకు పోతాడు అందుకే విజయ్ దేవరకొండ కూడా ఒకసారి రాజమౌళి చూసి నేర్చుకో అంటూ చాలామంది సినీ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు…