ప్రభు (Prabhu) కూతురు ఐశ్వర్య కి ఈ మధ్యనే గ్రాండ్ గా పెళ్లి చేశారు.అయితే ఐశ్వర్య కి మొదట తన మేనత్త కొడుకుతో వివాహం జరిగినప్పటికీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో డివోర్స్ తీసుకున్నారు.
ఇక డివోర్స్ తీసుకున్నాక ఇన్ని సంవత్సరాలకి కోలీవుడ్ లో యంగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్న అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకున్న సమయంలో డబ్బు కోసమే అధిక్ రవిచంద్రన్ తనకంటే వయసులో రెండేళ్లు పెద్దదైన ఐశ్వర్య (Aishwarya) ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారని కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి.

అంతేకాకుండా గతంలో మాజీ సినీ మీడియా వర్కర్ కికర్ బాలు (Kikar Balu) అధికక్ రవిచంద్రన్ 500 కోట్ల కట్నానికి ఆశపడే ఐశ్వర్యకి మొదటి పెళ్లి అయిందని తెలిసినా కూడా రెండో భర్తగా వెళ్లడానికి ఒప్పుకున్నారు అని చెప్పారంటూ కొన్ని రూమర్స్ చక్కర్లు కొట్టాయి.అయితే తాజాగా మాజీ సినీ మీడియా వర్కర్ కికర్ బాలు ఈ వార్తలపై క్లారిటీ ఇస్తూ.నేను ఐశ్వర్యను అధిక్ రవిచంద్రన్ డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడు అని ఎక్కడా చెప్పలేదు.

అలాగే 500 కోట్ల కట్నానికి ఆశపడి పెళ్లి చేసుకున్నాడని కూడా నేను చెప్పినట్లు వార్తలు వినిపించాయి.కానీ అందులో ఎలాంటి నిజం లేదు.అలా నేనేప్పుడు చెప్పలేదు.
కావాలంటే ప్రభు (Prabhu) తన కూతురికి 500 కోట్ల కట్నం ఇవ్వగలడు అని చెప్పాను.అంటూ క్లారిటీ ఇచ్చాడు.
ఇక శివాజీ గణేషన్ (Sivaji Ganeshan) కొడుకు అయినా ప్రభు కూతుర్ని అధిక్ రవిచంద్రన్ పెళ్లి చేసుకోవడం వల్ల ఆయనకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభిస్తుందని,ఫలితంగా ఆయనకు ఎక్కువ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని కూడా మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.మరి చూడాలి అధిక్ రవిచంద్రన్ సినీ కెరియర్ ఏ విధంగా ముందుకు పోతుందో.