అప్పడాలు( Appadalu ).పిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్ ఇది.
అప్పడాలను పాపడ్ అని పిలుస్తుంటారు.ఇంట్లో పప్పు, సాంబార్, రసం వంటివి చేసినప్పుడు కచ్చితంగా కరకరలాడే అప్పడాలు ఉండాల్సిందే.
రకరకాల పద్ధతుల్లో అప్పడాలను తయారు చేస్తుంటారు.అయితే పెసరపప్పుతో చేసిన అప్పడాలు చాలా రుచికరంగా ఉంటాయి.
ఇక వింతగా అనిపించవచ్చు.కానీ అప్పడాలతోనూ బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.అప్పడాల్లో ప్రోటీన్ మరియు ఫైబర్ మెండుగా నిండి ఉంటాయి.అందువల్ల ఇవి ప్రేగు కదలికలను నియంత్రించడంలో మరియు బరువును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.
అలాగే అప్పడాల్లో పొటాషియం, మెగ్నీషియం, ఇనుము( Potassium, magnesium, iron ) మరియు కార్బోహైడ్రేట్లు ఆరోగ్యకరమైన మొత్తంలో ఉంటాయి.సాయంత్రం వేల ఆకలిగా అనిపించినప్పుడు అప్పడాలు తినడం గొప్ప ఆలోచన.జ్వరం తర్వాత కొద్ది రోజులు నోటికి ఏమీ తినాలనిపించదు.సరిగ్గా ఆకలి కూడా వేయదు.అలాంటప్పుడు వేయించిన లేదా కాల్చిన అప్పడాలు తింటే ఆకలి పెరుగుతుంది.అప్పడాలు జీర్ణక్రియకు పనితీరును కూడా పెంచుతాయి.
అంతేకాకుండా అప్పడాలు ఎర్ర రక్త కణాల( Red blood cells ) ఉత్పత్తికి తోడ్పడతాయి.అప్పడాలను తినడం వల్ల గాయాలు, అల్సర్లు మరియు చర్మ ఇన్ఫెక్షన్ల వంటి చర్మ సమస్యలు త్వరగా నయం అవుతాయి.అయితే ఆరోగ్యానికి మంచిదన్నారు కదా అని నిత్యం లిమిట్ లెస్ గా అప్పడాలు తింటే మాత్రం తిప్పలు తప్పవు.అప్పడాల్లో సోడియం ఎక్కువగా ఉంటుంది, అందువల్ల రక్తపోటు ఉన్నవారికి ఇవి సిఫార్సు చేయబడవు.
అలాగే అప్పడాల్లో వివిధ రకాల మసాలా దినుసులను ఉపయోగిస్తాయి.సో ఎక్కువ మోతాదులో తింటే అసిడిటీ మరియు ఇతర జీర్ణ సమస్యలకు కారణమవుతాయి.
ఇక అప్పడాలను ఒకే నూనెలో పదేపదే వేయించి తింటే గుండె జబ్బులు, మధుమేహం వచ్చే రిస్క్ పెరుగుతుంది.