జయలలిత పేరుతో మనకి ఇద్దరు నటీమణులు ఉన్నారు.అందులో ఒకరు పురుట్చి తలైవి గా పేరు సంపాదించుకుని మహానటి సావిత్రి కంటే కూడా ఎక్కువగా తమిళ అభిమానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ జయలలిత.
ఆమె తెలుగులో, కన్నడలోనూ అనేక సినిమాల్లో నటించి సౌత్ ఇండియాలోనే కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.హీరోయిన్ గా కెరియర్ ముగిసిన సమయంలో రాజకీయాల్లోకి ప్రవేశించి మెల్లిమెల్లిగా ముఖ్యమంత్రి హోదాకి చేరుకున్నారు.
అంతేకాదు తమిళనాడులో ఆమెను అందరూ అమ్మ అని సంబోధిస్తారు.
ఇక మరొక నటి జయలలిత ఎక్కువగా వంశీ సినిమాలలో వాంప్ పాత్రలో లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించేది.
అందుకే ఆమె కూడా ఎక్కువగా తమిళనాడులోనే ఉండేవారు.ప్రస్తుతం టీవీ సీరియల్స్ లో ఎక్కువగా నటిస్తున్న జయలలిత హీరోయిన్ అవ్వాలనుకుని ఇండస్ట్రీకి వచ్చి వ్యాంప్ ఆర్టిస్టుగా మిగిలిపోయారు.
కేవలం తెలుగు లోనే కాదు ఈమె తమిళం లో కూడా అదే తరహా పాత్రలు ధరించేవారు.అయితే వాంప్ పాత్రల కోసం ఎక్స్పోజింగ్ ఎక్కువగా చేయడంతో పురుట్చి తలైవి హీరోయిన్ జయలలిత కి శాపంగా మారింది.
వ్యాంప్ ఆర్టిస్ట్ జయలలితను అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జయలలిత పై విమర్శలు ఎక్కు పెట్టేవారు ప్రతిపక్ష నాయకులు.జయలలితను తిట్టాలన్న దివంగత ముఖ్యమంత్రి ఈ కరుణానిధికి మరొక జయలలిత పేరు వాడుకునేవారు.
దాంతో ఆవిడను పేరు మార్చుకోమని సలహా ఇచ్చిందట జయలలిత.కానీ అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో అన్నా డిఎంకె పార్టీ నాయకుల నుంచి బెదిరింపులు కూడా వచ్చాయట కొంతమంది ఆమె ఇంటి ముందు కూర్చుని గొడవకు కూడా దిగారట.మా అమ్మ కి ఎదురు చెప్తావా అంటూ అమే ఇంటి ముందు బైఠాయించి నినాదాలు కూడా చేశారట.ఎవరెన్ని చెప్పినా తాను మార్చుకోవడానికి సిద్ధంగా లేనని జయలలిత భీష్మించుకుని కుర్చుకున్నారట.
ఇలా ఇద్దరు హీరోయిన్స్ పేర్లు ఒకటే కావడం తో తమిళనాడు లో పెద్ద యుద్దమే జరిగింది.