చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక్క హార్బర్ నిర్మాణానికి కనీసం శంకుస్థాపన అయినా చేశారని నిరూపిస్తే రాజకీయాలకు దూరమవుతానని రాష్ట్ర మత్స్య పశు సంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుపై సవాల్ విసిరారు.
శ్రీకాకుళం జిల్లా, పలాస నియోజకవర్గ కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీదిరి మాట్లాడారు.
రాష్ట్రంలో 975 కిలోమీటర్ల మేర తీరప్రాంతమున్నా ఏనాడు హార్బర్ల ఏర్పాటుకు ప్రయత్నించలేదన్నారు.నౌపడా సభలో అచ్చెన్నకు మొగుడ్ని రంగంలో దింపారని, ఈ దఫా ఎలా గెలుస్తావో చూస్తామని వ్యాఖ్యానించారు.
అభివృద్ధిపైన, సీఎం జగన్మోహన్ రెడ్డిపైన విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.మా ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి పై సందేహముంటే చర్చకు వస్తే తాను సిద్ధమని ప్రకటించారు.