ఇటీవల చంద్రబాబు చేపట్టిన కుప్పం మూడు రోజుల పర్యటనలో అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కార్యక్రమం రసాపసగా మారిన సమితి తెలిసిందే.చంద్రబాబు పర్యటనలు టిడిపి వర్సెస్ వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొనడంతో రెండో రోజు అన్నా క్యాంటీన్ కార్యక్రమం పెద్ద వివాదాస్పదంగా మారింది.
ఈ క్రమంలో అన్న క్యాంటీన్ ధ్వంసం కూడా అయింది.అనంతరం మళ్లీ అదే రోజు సాయంత్రం అన్నా క్యాంటీన్ రెడీ చేసి చంద్రబాబు.
అన్నం వడ్డించారు.ఇప్పుడు ఇదే తరహాలో తెనాలిలో అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కార్యక్రమం అడ్డుకోవటంతో నారా లోకేష్ సోషల్ మీడియాలో సీరియస్ అయ్యారు.
అన్నం తినే వారెవ్వరూ అన్న క్యాంటీన్‌ను అడ్డుకోరని… జగన్ రెడ్డి తింటుంది ఏంటో ఆయనే తేల్చుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు.నందిగామ, మంగళగిరి, కుప్పంలో అడ్డుపడ్డారని… ఇప్పుడు తెనాలిలో అన్న క్యాంటీన్ నిర్వహించకుండా ఆపుతున్నారని మండిపడ్డారు.
జగన్ రెడ్డిలో మానవత్వం అనేదే లేదా? అని ప్రశ్నించారు.తెనాలిలో అన్న క్యాంటీన్ కు అడ్డుపడటం మార్కెట్ కాంప్లెక్స్ వద్ద యుద్ద వాతావరణాన్ని తలపించే విధంగా పోలీస్ పహారా పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్న క్యాంటీన్ నిర్వహించి తీరుతామని… పేద వాళ్ళ ఆకలి తీరుస్తామని లోకేష్ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.