కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశం ముగిసింది.కేరళ రాజధాని తిరువనంతపురం వేదికగా నిర్వహించిన ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు గైర్హాజరు అయ్యారు.
కాగా కేరళ సీఎం పినరయి విజయన్ తో పాటు తమిళనాడు, కర్ణాటక సీఎంలు ఎంకే స్టాలిన్, బసవరాజ్ బొమ్మైలు హాజరయ్యారు.
దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారం, వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది.
ఇందులో మొత్తం 26 అంశాలపై చర్చించారు.వీటిలో తొమ్మిది అంశాలకు వెంటనే పరిష్కారం లభించగా.
మిగిలిన 17 అంశాలపై మలి విడత సమావేశంలో చర్చిస్తామని అమిత్ షా తెలిపారు.అయితే, తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హాజరు కాగా… ఏపీ నుంచి అధికారుల బృందం హాజరైనట్లు తెలుస్తోంది.







