వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సిబిఐ స్పీడ్ పెంచింది.శుక్రవారం రఘునాథరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి లను సిపిఐ విచారించడం జరిగింది.
ఫస్ట్ టైం ఈ కేసులో రఘునాధ రెడ్డి విచారణకు హాజరయ్యారు.ఇతను సీఎం క్యాంప్ కార్యాలయ సిబ్బంది గా విధులు నిర్వహిస్తున్నారు.
వైసీపీ కార్యదర్శి శివశంకర్ రెడ్డి ని దాదాపు ఏడు గంటల పాటు సిబిఐ అధికారులు విచారించారు.గతంలో కూడా సిబిఐ సిట్.
బృందాలు పలు మార్లు ప్రశ్నించాయి.ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారాన్ని సిబిఐ రావటం జరిగింది.
అదే తరుణంలో డాక్టర్ భరత్ రెడ్డిని కూడా సిబిఐ అధికారులు విచారించారు.ఈ క్రమంలో హత్యకు ఉపయోగించిన ఆయుధాలతో పాటు కీలక డాక్యుమెంట్లను సీజ్ చేశారు.మరోవైపు శివశంకర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మణికంఠ రెడ్డి పై వివేకానంద రెడ్డి కూతురు సునీత పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.