కరోనా వైరస్ ఇప్పుడు చైనాని తీవ్ర స్థాయిలో భయపెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇప్పటికే ఈ వైరస్ బారిన వందలాది మంది హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్నారు.
కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారు.ఈ వైరస్ ప్రభావం ఇతర దేశాల్లోకి రాకుండా ఇప్పటికే అన్ని దేశాలు ముందస్తు రక్షణ చర్యలు చేపడుతున్నాయి.
అయితే చైనాలో ఇతర దేశాలకు చెందిన వారు ఇరుక్కోవడంతో వారికేమైనా కరోనా వైరస్ ఎఫెక్ట్ అవుతుందనే టెన్షన్ చాలా మందిలో ఉంది.ముఖ్యంగా చైనాకు భారత్ దగ్గరగా ఉండటంతో కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఇండియా ఎలా ఉండే అవకాశం ఉంది.
ఇప్పటికే ఇండియాలో కేరళా రాష్ట్రంలో మొదటి కరోనా కేసు నమోదైందని తెలుస్తుంది.చైనాలో వూహాన్ యూనివర్శిటీలో చదువుతున్న విద్యార్థికి కరోనా వైరస్ సోకింది.
ఇక విద్యార్ధిని హాస్పిటల్ లో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.
మరో వైపు చైనాలోని వుహాన్ నగరంలో తెలుగు రాష్ట్రాలకి చెందిన ఇంజనీర్లు చిక్కుకుపోయారు.
వీరు ఎలా ఉన్నారో తెలియక కొద్ది రోజుల నుంచి కుటుంబ సభ్యులు టెన్షన్ పడుతున్నారు.ఇదిలా ఉంటే తాజాగా తెలుగు ఇంజనీర్లు తమ క్షేమ సమాచారమపై సెల్ఫీ వీడియో విడుదల చేశారు.
తాము క్షేమంగానే ఉన్నామని మమ్మల్ని ఎవరూ బంధించలేదని తెలిపారు.సమయానికి ఆహారం, తాగునీళ్లు ఇస్తున్నారని అలాగే మూడు పూటలా మా శరీర ఉష్ణోగ్రతలను పరిశీలిస్తున్నారని సెల్ఫీ వీడియోలో వెల్లడించారు.
బీజింగ్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నామని త్వరలోనే ఇండియాకి వస్తామని తెలియజేశారు.దీంతో ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు.