ముఖ్యంగా చెప్పాలంటే మానవ శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఊపిరితిత్తులు( Lung Health : ) కూడా ఒకటి అని దాదాపు చాలా మందికి తెలుసు.ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి అంటే శ్వాస తీసుకోవడం ఎంతో ఇబ్బందిగా మారిపోతుంది.
ఊపిరితిత్తులు చెడిపోతే మనిషి మరణానికి దగ్గరవుతాడు.ఇలాంటి పరిస్థితులలో ఊపిరితిత్తులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అనీ నిపుణులు చెబుతున్నారు.
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటే మీ శరీరమంతా ఆరోగ్యంగా ఉంటుంది.ఇది శరీరంలోని రక్తానికి ఆక్సిజన్ ని అందిస్తాయి.
ముఖ్యంగా చెప్పాలంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటూ ఉండాలి.

ఆ ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ఊపిరితిత్తులు శరీరంలో ముఖ్యమైన భాగం.అంతేకాకుండా ఊపిరితిత్తులు శరీరం నుంచి కార్బన్ డయాక్సైడ్ ( Carbon dioxide )ను తొలగించే పని చేస్తాయి.
ఉపిరితిత్తులను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం.ఇందుకోసం సరైన ఆహారం తీసుకోవాలి.
వీలైనంత ఎక్కువ మంచి నీరు తాగుతూ ఉండాలి.ప్రతి రోజు బ్రోకలీ( Broccoli )ని తీసుకోవాలి.
దీని వల్ల ఊపిరితిత్తుల సమస్యలు దూరం అవుతాయి.ఇంకా చెప్పాలంటే చలి కాలంలో బ్రోకలీ నీ క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

అలాగే మద్యపానం, ధూమపానికి దూరంగా ఉండాలి.ఇంకా చెప్పాలంటే శీతాకాలంలో చాలా మంది క్యారెట్( Carrots ) తినడానికి ఇష్టపడుతుంటారు.కొంత మంది క్యారెట్ జ్యూస్ తాగడానికి కూడా ఇష్టపడుతుంటారు.ఇది ఊపిరితిత్తులను బలంగా తయారు చేస్తుంది.ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి.మీరు రోజు దానిమ్మ పండు( Pomegranate ) తీసుకుంటూ ఉండాలి.
ఇది శరీరంలో రక్తాన్ని పెంచి మిమ్మల్ని ఫీట్ గా ఉంచుతుంది.ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
చలికాలంలో పచ్చిబఠానీ( Green Peas )లను ఎక్కువగా తింటూ ఉండాలి.ఇది శరీరం పై మెరుపును తెస్తుంది.
శరీరంలోని అనేక వ్యాధులను దూరం చేస్తుంది.