ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీతో రకరకాల స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి అద్భుతమైన ఫీచర్లతో విడుదల అవుతూనే ఉన్నాయి.స్మార్ట్ ఫోన్ కంపెనీ తయారీ సంస్థలు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన స్మార్ట్ ఫోన్ లను ఉత్తమమైన స్పెసిఫికేషనులతో తీసుకురావడానికి ఎన్నో కంపెనీలు పోటీ పడుతున్నాయి.
మార్కెట్లో ప్రస్తుతం స్మార్ట్ ఆండ్రాయిడ్ ఫోన్లో 200 ఎంపీ కెమెరాలు అలాగే 210 w ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యాలను కలిగిన ఎన్నో ఫోన్లు చూస్తూనే ఉన్నాం.ఈ క్రమంలో 24GB RAM తో నుబియా యొక్క రెడ్ మ్యూజిక్ ఫోన్( Red Music Phone ) మార్కెట్లోకి విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.ప్రస్తుతం ఈ ఫోన్ ప్రపంచంలో ఉండే స్మార్ట్ ఫోన్లలో అత్యంత శక్తివంతమైన ఫోన్ గా ప్రత్యేక గుర్తింపు పొందనుంది.
ప్రపంచంలో 24 GB రామ్ తో రాబోతున్న మొదటి స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం.
అయితే కొంతమందికి వర్చువల్ రామ్ ని ఉపయోగించడం ద్వారా ఇది సాధ్యం అవుతుందా అని అనుమానం కలగవచ్చు.ఈ ఫోన్ 24 GB ఫిజికల్ రామ్( 24GB Ram ) కలిగి ఉంటుంది.ఈ ఫోన్ యొక్క ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం.
ఈ రెడ్ మ్యూజిక్ 8ఎస్ ప్రో ఫోన్ 24GB తో వస్తూ ఉండడంతో హెవీ ఎడిటింగ్ గేమింగ్ మల్టీ టాస్కింగ్ లాంటివి అన్ని సులభంగా వేగంగా చేసుకోవచ్చు.ఈ ఫోన్ 120 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్, 6.8 అంగుళాల ఫుల్ HD ప్లస్, OLED డిస్ ప్లే ను కలిగి ఉంటుంది.50 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్, 16 మెగా పిక్సెల్ అండర్ డిస్ ప్లే ఫ్రంట్ కెమెరా, 18 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 6000 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది.