సోనూసూద్ అనే పేరు దేశంలో విననివాళ్లు ఎవరూ లేరనే చెప్పవచ్చు.దేశం మొత్తం ప్రజలకు దేవుడుగా నిలిచాడు.
గత ఏడాది విజృంభించిన కరోనా వైరస్ ఇప్పటికి రెండవ దశ తో మళ్లీ ప్రజలను వణికిస్తుంది.ఎంతోమంది కూలీలు, నిరుపేదలు ఈ సమయంలో ఏమి చేయలేక దిక్కు తోచని వాళ్ళుగా మిగిలారు.
దీంతో అదే సమయంలో దేవుడు గా వచ్చాడు సోనూసూద్.గత ఏడాది నుండి విరామం లేకుండా ప్రతి ఒక్కరికి తన వంతు సహాయం చేస్తూనే ఉన్నాడు.
ఇప్పటికీ తన సహాయానికి విరామం ఇవ్వట్లేదు.గత ఏడాది వలస కార్మికులను తమ సొంత గూటికి చేర్చినప్పటి నుండి ఈ క్షణం వరకు ఏదో ఒక సహాయం చేస్తూనే ఉన్నాడు.
సినిమాలలో విలన్ పాత్రలో మెప్పించిన సోనూ.నిజ జీవితంలో దేవుడి గా నిలిచాడు.ఎంతోమందికి తమ ప్రాణాలను అందించాడు.ఇదిలా ఉంటే ఇంత చేస్తున్నా సోనూసూద్ కి ఇంత డబ్బు ఎక్కడినుండి వస్తుందనే ఆలోచన రావచ్చు.
ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైన, ఏ ప్రజా అధికారి అయిన ఈ విధంగా సహాయం చేయరు.అంతేకాకుండా అంత డబ్బు కూడా ప్రజల కోసం వెచ్చించరు.అలాంటిది సోనూసూద్ ఓ రాజకీయ నాయకుడు కూడా కాదు ఇంత చేయడం, ప్రజలకు ఇంత ఖర్చు పెట్టడం వెనుక ఇంత డబ్బు ఎక్కడ వస్తుందని అందరిలో ప్రశ్న మొదలయింది.ఇక ఆ ప్రశ్నకి సోనూసూద్ సమాధానం ఏంటో విందాం.
తాజాగా సోనూ ఓ ఇంటర్నేషనల్ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఇక ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పగా.ఈ ప్రశ్నకి కూడా సమాధానం తెలిపాడు సోనూ.తాను గత ఏడాది నుండి చేస్తున్న సేవలకు ఎంతోమంది స్ఫూర్తి పొందారట.
అంతే కాకుండా తనని చాలా మంది తమ వంతు సహాయం కోసం సంప్రదించారట.తనతో పాటు ఈ సేవలో భాగస్వాములు అవుతామని తెలిపారట.
ఇక ఈ దీంతో ఆయన మీద ఉన్న నమ్మకంతో వాళ్లు విరాళం ఇవ్వడానికి ముందుకు వచ్చారని, అంతే కాకుండా అనేక రకాల సేవలలో భాగస్వాములు అవుతున్నారని తెలిపాడు.ఇక తన దగ్గర ఉన్న డబ్బుకు.
ముందుకు వచ్చిన దాతల డబ్బులను కూడా చేర్చి సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా సహాయం చేస్తున్నామని తెలిపాడు.తన చేసిన సహాయం వల్ల ఎంతోమంది ప్రాణాలు నిలిచినందుకు ఆ సంతృప్తి మాటల్లో వర్ణించలేనిదని తెలిపాడు.

ఇక తన సేవా సంస్థ ఇక ముందైనా కూడా మరిన్ని సేవలను అందించడానికి అదే స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపాడు.
తాను కేవలం కరోనా బాధితులిని ఆదుకోవడం తోనే ముగించలేను అంటూ.లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లను కూడా ఆదుకోవడానికి ఏర్పాట్లు చేశామని తెలిపాడు.ఇప్పటికే కంపెనీల భాగస్వామ్యంతో రెండు లక్షల మందికి ఉపాధి కల్పించామని, లక్షల మందికి స్కిల్స్ నేర్పించి ఉపాధి అవకాశాన్ని ఇచ్చే బాధ్యతలు కూడా చేపట్టామని సోనూ సూద్ తన మాటల ద్వారా తెలిపాడు.