అతడు సినిమాలో ఆ సీన్ ఆ నవల్ నుంచి కాపీ కొట్టారని మీకు తెలుసా..?

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా అతడు ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి ఒపీనియన్ ఉంది.త్రివిక్రమ్ అప్పటి వరకు రైటర్ గా సూపర్ సక్సెస్ అయ్యాడు తాను డైరెక్టర్ గా మారి చేసిన నువ్వే నువ్వే సినిమా యావరేజ్ గా ఆడింది దింతో నెక్స్ట్ సినిమాతో తనని తాను ప్రూవ్ చేసుకోవాలి అనే దృఢ సంకల్పం తో మంచి కథ రాసుకొని సినిమా చేయాలి అనే ప్లాన్ లో ఉన్నప్పుడు మహేష్ బాబు తో అతడు సినిమా చేసే అవకాశం వచ్చింది దాంతో మంచి హిట్ అందుకున్నాడు…

 Mahesh Babu Athadu Movie Scenes Copied From Yamudu Novel,mahesh Babu,trivikram,y-TeluguStop.com

ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ త్రివిక్రమ్ చేసిన ప్రతి సినిమా మీద కూడా ఏదో ఒక సీన్ కానీ స్టోరీ కానీ కాపీ చేసారు అనే మాట అయితే బలంగా వినిపిస్తూ ఉంటుంది.అయితే అతడు సినిమా మీద కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి.అవేంటంటే అతడు సినిమాలో మహేష్ బాబు సునీల్ ఇద్దరు నైట్ టైం పంతులు ఇంటికి వెళ్లి వాళ్ల ఇంట్లో చెట్ల దగ్గర డబ్బులు వేసే సీన్ అక్కడ సునీల్ చెప్పే డైలాగ్స్ అన్ని కూడా కాపీ నే, ప్రముఖ నవల రచయిత అయినా మధుబాబు గారు రాసిన యముడు అనే బుక్ లో ఇలాంటి సీన్ ఉంటుంది.కాకపోతే అక్కడ రాముడు లక్ష్మణుడు ఇంటికి వచ్చారు అని చెప్తాడు ఇక్కడ సీత లేని రాముడు తోక లేని హనుమంతుడు వచ్చాడు అనే డైలాగ్ చెప్తాడు కొంచం సీన్ లోని డైలాగ్స్ మార్చి ఈ సినిమాలో పెట్టుకున్నారు…

అలాగే ఈ సినిమా లో ఇంకో సీన్ కూడా తీసుకున్నారు అదేంటంటే హీరో చిన్నప్పుడు వేరే ఫ్రెండ్ తో అర్థరాత్రి స్మశానం లోకి వెళ్ళాలి అని పందెం కాసే సీన్ కూడా మధు బాబు గారి బుక్ లో నుంచి తీసుకుందే కానీ త్రివిక్రమ్ దీని ఒక్కదానికి మాత్రం మధుబాబు గారి పర్మిషన్ తీసుకున్నట్టు గా అప్పట్లో మధుబాబు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు…

 Mahesh Babu Athadu Movie Scenes Copied From Yamudu Novel,Mahesh Babu,Trivikram,Y-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube