కరోనా సెకండ్‌ వేవ్‌ ఎఫెక్ట్‌.. మొదట 'పుష్ప' మీదే పడబోతుందా?

అల్లు అర్జున్‌, సుకుమార్ ల కాంబినేషన్‌ లో రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్ రెండు మేజర్‌ షెడ్యూల్స్‌ పూర్తి చేసుకుంది.మరో రెండు కీలక షెడ్యూల్స్‌ కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

 Corona Second Wave Effect On Allu Arjun And Sukumar Movie Pushpa, Allu Arjun ,pu-TeluguStop.com

కరోనా కారణంగా భారీ ఎత్తున జనాలు గుమ్మి కూడటంపై తెలుగు రాష్ట్రాలు ఆంక్షలు పెట్టాయి.దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకునే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

కరోనా కారణంగా గత ఏడాది నుండి వాయిదా పడుతూ వచ్చిన పుష్ప సినిమా ఎట్టకేలకు ప్రారంభం అయ్యిందనుకుంటూ ఉండగా మళ్లీ ఇలా కరోనా వల్ల షూటింగ్‌ కు అంతరాయం కలగడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.

సినిమా షూటింగ్ కరోనా వల్ల కనీసం నెలన్నర ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

దాంతో సినిమా ను అనుకున్న సమయానికి విడుదల చేసే అవకాశం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో అప్పుడే టాక్‌ మొదలు అయ్యింది.పుష్ప సినిమా ను ఆగస్టులో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

అయితే ఇప్పటి వరకు సినిమా షూటింగ్‌ విషయమై క్లారిటీ రాలేదు.జూన్‌ జులై వరకు సినిమా ముగిసే విషయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కనుక ఆగస్టులో సినిమా రావడం అనేది సాధ్యం కాకపోవచ్చు అంటున్నారు.భారీ అంచనాలున్న ఈ సినిమా ను హడావుడిగా కాకుండా మెల్లగానే పూర్తి చేయాలని సుకుమార్‌ భావిస్తున్నాడు.

కనుక సినిమా విడుదల వాయిదా వేసినా పర్వాలేదు అంటూ నిర్మాతలు భావిస్తున్నారు.సుకుమార్ కనుక సంతృప్తి చెందకుంటే మళ్లీ మళ్లీ రీ షూట్‌ లు కూడా చేస్తాడట.

కనుక ఆయన అనుకున్న ప్రకారం సినిమా ను ఆగస్టులో విడుదల చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube