ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే కాయకూరల్లో గుమ్మడికాయ ఒకటి.గుమ్మడిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలే కాదు, అనేక అనారోగ్య సమస్యలను నివారించే ఔషధ గుణాలూ నిండి ఉంటాయి.
అందుకే వారానికి ఒక సారైనా గుమ్మడి కాయను తినాలని నిపుణులు చెబుతుంటారు.అలాగే ముఖ సౌందర్యానికి సైతం గుమ్మడి కాయ ఉపయోగపడుతుంది.
మరి లేటెందుకు గుమ్మడికాయను చర్మానికి ఎలా యూజ్ చేయాలి.? అసలు గుమ్మడి వల్ల ఏయే ప్రయోజనాలు చర్మానికి అందుతాయి.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.
ప్రస్తుతం వింటర్ సీజన్ కావడం వల్ల దాదాపు చాలా మంది పొడి చర్మంతోనే ఇబ్బంది పడుతూ ఉంటారు.
అయితే కొన్ని గుమ్మడి కాయ ముక్కలను వాటర్ సాయంతో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు చిన్న గిన్నెలో రెండు స్పూన్ల గుమ్మడికాయ పేస్ట్, ఒక స్పూన్ తేనె, రెండు విటమిన్ ఇ క్యాప్సుల్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసి.
ముఖానికి, మెడకు పట్టించాలి.ఆరిన తర్వాత కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకుంటే.పొడి చర్మం తేమగా, మృదువుగా మారుతుంది.

అలాగే మొటిమలు, నల్లటి మచ్చలతో బాధ పడే వారికీ గుమ్మడి హెల్ప్ చేస్తుంది.ఒక బౌల్‌లో రెండు స్పూన్ల గుమ్మడికాయ పేస్ట్, అర స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి కలుపుకోవాలి.ఈ మిశ్రమాలు ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి.
పది నిమిషాల తర్వాత వాటర్‌తో శుభ్రపరుచుకోవాలి.ఇలా రోజూ చేస్తే మొటిమలు, మచ్చలు పరార్ అవుతాయి.

ఇక స్కిన్ టోన్‌ను పెంచుకోవాలని కోరుకునే వారు.ఒక స్పూన్ గుమ్మడికాయ పేస్ట్‌కు, ఒక స్పూన్ బొప్పాయి పండు పేస్ట్, ఒక స్పూన్ పాలు కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి.పావు గంట పాటు ఆరనిచ్చి.ఆపై గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజూ చేస్తే చర్మం తెల్లగా, కాంతివంతంగా మారుతుంది.