దేశం కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది ; ప్రధాని మోదీ

దేశ ప్రగతిలో కొన్ని అంశాలు ప్రత్యేకంగా నిలుస్తాయని అదే విధంగా మే 28 కూడా చరిత్రలో ఒక ప్రత్యేక దినంగా నిలబడుతుందని ప్రధాని మోదీ( Prime Minister Modi ) అన్నారు.నుతన పార్లమెంట్ భవనాన్నిఅట్టహాసం గా ప్రారంబించిన తర్వాత తన మొదటి స్పీచ్ ఇచ్చిన ఆయన ఈ విదం గా వాఖ్యలు చేశారు .

 Modi New Parliement Speech , Parliement Speech, Sengol, Technology, Prime Minis-TeluguStop.com

ఇది భవనం కాదని, 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతీకని ఆయన చెప్పుకొచ్చారు .స్వాతంత్ర వీరుల కలలకు ఈ భవనం శాకారంగా నిలుస్తుందని ఆయన అన్నారు .కొత్త లక్ష్యాలతో దేశం ముందుకు వెళ్తుందని, ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత వైపే ఆశగా చూస్తుందని ఆయన తన మొదటి స్పీచ్ లో చెప్పుకొచ్చారు.

దేశ అవసరాలు పెరుగుతున్నాయి, పాత పార్లమెంట్ భవనం లో కూర్చోవడానికి మాత్రమే సమస్య కాకుండా అనేక సాంకేతిక ఇబ్బందులు ఉండేవి.ఇప్పుడు సాంప్రదాయానికి టెక్నాలజీని( Technology ) మేలవించి నిర్మించిన ఈ భవనం దేశ భవిష్యత్తు అవసరాలను తీరుస్తుందని ,వచ్చే కొన్ని సంవత్సరాలలో ఎంపీల సంఖ్య పెరుగుతుందని , అయినా అప్పటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ భవనాన్ని నిర్మించామని ఆయన చెప్పుకొచ్చారు.

సంకల్పానికి ప్రతీకగా ఉండే సెంగోలను ప్రతిష్టించుకోవడం గర్వంగా ఉంది అన్న ఆయన, మీడియాలు కథనాల ద్వారా సెంగోల్ ( Sengol ) గొప్పతనం దేశ ప్రజలందరికీ తెలియటం మంచి విషయం అన్నారు.భారత దేశం ప్రజాస్వామ్యాన్ని పాటించే దేశమే కాదు ,ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిదని, భారత ప్రజాస్వామ్యానికి ప్రపంచ దేశాలలో కూడా గౌరవం ఉందని ,ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు .దేశంలో అభివృద్ధి ఆగిపోకూడదని రాజకీయ అవసరాలు, కారణాలు ఎలా ఉన్నా అభివృద్ధి అన్నది ఒక నిరంతరం ప్రక్రియ అని, అది కొనసాగుతూనే ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube