దేశం కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది ; ప్రధాని మోదీ

దేశ ప్రగతిలో కొన్ని అంశాలు ప్రత్యేకంగా నిలుస్తాయని అదే విధంగా మే 28 కూడా చరిత్రలో ఒక ప్రత్యేక దినంగా నిలబడుతుందని ప్రధాని మోదీ( Prime Minister Modi ) అన్నారు.

నుతన పార్లమెంట్ భవనాన్నిఅట్టహాసం గా ప్రారంబించిన తర్వాత తన మొదటి స్పీచ్ ఇచ్చిన ఆయన ఈ విదం గా వాఖ్యలు చేశారు .

ఇది భవనం కాదని, 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతీకని ఆయన చెప్పుకొచ్చారు .

స్వాతంత్ర వీరుల కలలకు ఈ భవనం శాకారంగా నిలుస్తుందని ఆయన అన్నారు .

కొత్త లక్ష్యాలతో దేశం ముందుకు వెళ్తుందని, ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత వైపే ఆశగా చూస్తుందని ఆయన తన మొదటి స్పీచ్ లో చెప్పుకొచ్చారు.

"""/" / దేశ అవసరాలు పెరుగుతున్నాయి, పాత పార్లమెంట్ భవనం లో కూర్చోవడానికి మాత్రమే సమస్య కాకుండా అనేక సాంకేతిక ఇబ్బందులు ఉండేవి.

ఇప్పుడు సాంప్రదాయానికి టెక్నాలజీని( Technology ) మేలవించి నిర్మించిన ఈ భవనం దేశ భవిష్యత్తు అవసరాలను తీరుస్తుందని ,వచ్చే కొన్ని సంవత్సరాలలో ఎంపీల సంఖ్య పెరుగుతుందని , అయినా అప్పటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ భవనాన్ని నిర్మించామని ఆయన చెప్పుకొచ్చారు.

"""/" / సంకల్పానికి ప్రతీకగా ఉండే సెంగోలను ప్రతిష్టించుకోవడం గర్వంగా ఉంది అన్న ఆయన, మీడియాలు కథనాల ద్వారా సెంగోల్ ( Sengol ) గొప్పతనం దేశ ప్రజలందరికీ తెలియటం మంచి విషయం అన్నారు.

భారత దేశం ప్రజాస్వామ్యాన్ని పాటించే దేశమే కాదు ,ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిదని, భారత ప్రజాస్వామ్యానికి ప్రపంచ దేశాలలో కూడా గౌరవం ఉందని ,ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు .

దేశంలో అభివృద్ధి ఆగిపోకూడదని రాజకీయ అవసరాలు, కారణాలు ఎలా ఉన్నా అభివృద్ధి అన్నది ఒక నిరంతరం ప్రక్రియ అని, అది కొనసాగుతూనే ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు .

సినిమా కోసం అలాంటి టాటూ వేయించుకున్న ఆనంద్ దేవరకొండ.. అర్థమేంటో తెలుసా?