ముస్లిం ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమావేశం...

ఉమ్మడి పౌరస్మృతి అంశంపై తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రితో పంచుకున్న ముస్లిం ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులు.సీఎం జగన్(CM JAGAN ) కామెంట్స్ ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం.

 Chief Minister Ys Jagan Meeting With Muslim Public Representatives, Religious Le-TeluguStop.com

బడుగు, బలహీనవర్గాల, మైనార్టీల ప్రభుత్వం మీరు ఎలాంటి ఆందోళనకు, భయాలకు గురికావాల్సిన అవసరం లేదు మీ మనసు నొప్పించేలా ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం వ్యవహరించదు: ఉమ్మడి పౌరస్మృతి అంశంమీద డ్రాఫ్ట్‌ అనేది ఇప్పటివరకూ రాలేదు.అందులో ఏ అంశాలు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియదు.

కాని మీడియాలో, పలుచోట్ల చర్చ విపరీతంగా నడుస్తోంది.వాటిని చూసి ముస్లింలు పెద్దస్థాయిలో తమ మనోభావాలను వ్యక్తంచేస్తున్నారు.

కొన్ని అంశాలను మీ అందరి దృష్టికి తీసుకు వస్తున్నాను: సీఎం – ఒక రాష్ట్రానికి పాలకుడిగా, ముఖ్యమంత్రి స్థాయిలో నేను ఉన్నాను.ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటేగనుక ఏం చేసేవారన్నదానిపై మీరు ఆలోచనలు చేసి నాకు సలహాలు ఇవ్వండి.

ఇక్కడ ఇంకో విషయాన్నికూడా మీ దృష్టికి తీసుకు వస్తున్నాను.ముస్లిం ఆడబిడ్డల హక్కుల రక్షణ విషయంలో ముస్లింలే వ్యతిరేకంగా ఉన్నారంటూ పెద్ద ప్రొపగండా నడుస్తోంది.ఇలాంటి దాన్ని మత పెద్దలుగా మీరు తిప్పికొట్టాలి.ఒకే కడుపున పుట్టిన బిడ్డల విషయంలో ఏతండ్రైనా, ఏతల్లి అయినా ఎందుకు భేదభావాలు చూపుతారు?మహిళలకు సమాన హక్కుల విషయంలో ఏ మాత్రం రాజీలేదనే విషయాన్ని మన అంతా స్పష్టం చేద్దాం.భారతదేశం చాలా విభిన్నమైనది.ఈ దేశంలో అనేక మతాలు, అనేక కులాలు, అనేక వర్గాలు ఉన్నాయి.

ఒకే మతంలో ఉన్న వివిధ కులాలు, వర్గాలకూ వివిధ రకాల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉన్నాయి.వారివారి మత గ్రంధాలు, విశ్వాసాలు, ఆచరించే సంప్రదాయాల ఆధారంగా వారికి వారి పర్సనల్‌ లాబోర్డులు ఉన్నాయి.

ఏ నియమమైనా ఏ నిబంధన అయినా సాఫీగా తీసుకురావాలనుకున్నప్పుడు నేరుగా ప్రభుత్వాలు కాకుండా ఆయా మతాలకు చెందిన సంస్థలు, పర్సనల్‌ లాబోర్డుల ద్వారానే చేయాలి.ఎందుకంటే వాటిమీద పూర్తి అవగాహన వారికే ఉంటుంది కాబట్టి.

Misinterpretationకు తావు ఇవ్వకుండా ఉంటుంది కాబట్టి.ఒకవేళ మార్పులు అవసరం అనుకుంటే, ఈ విషయంలో సుప్రీంకోర్టు( Supreme Court ), లా కమిషన్‌, కేంద్ర ప్రభుత్వం కూడా అందరూ కలిసి, వివిధ మతాలకు చెందిన సంస్థలను, వారి పర్సనల్‌ లాబోర్డ్స్‌తో మమేకమై, వారి పర్సనల్‌ లా బోర్డ్స్‌ ద్వారా ఒకవేళ మార్పులు అవసరమైతే జరగాలి తప్ప వేరే పద్ధతిలో జరిగితే, అది ఇంత భిన్నత్వం ఉన్న మన దేశంలో తగదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube