ఇలాంటి వాస్తు దోషాలు ఉంటే గర్భం దాల్చడం కష్టమేనా..

ఇల్లు, కార్యాలయాలు, పెద్దపెద్ద భవంతులు కట్టేటప్పుడు ఖచ్చితంగా ప్రజలందరూ వాస్తును చూసుకుంటూ ఉంటారు.ఏ దిక్కులో ఏది ఉండాలన్నది పక్కాగా ప్లాన్ చేసుకొని నిర్మించుకుంటూ ఉంటారు.

 Is It Difficult To Conceive If There Are Such Vastu Doshas?, Vastu , Vastu Tips,-TeluguStop.com

ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రజలు వాస్తును కచ్చితంగా ఫాలో అవుతున్నారు.ఇంట్లో చిన్న చిన్న దోషాల వల్ల ఇంటిల్లిపాది సమస్యలు ఎదుర్కొంటారని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.వాస్తు దోషాల వల్ల ఆరోగ్యం పై ప్రభావం పడినట్లుగానే గదుల స్థానం వల్ల సంతాన ఉత్పత్తి ప్రభావం పడే అవకాశం ఉంది.

కొన్ని దోషాల వల్ల ఆ ఇంట్లో ఎవరు సంతానం పొందలేరు.ఏళ్ల తర బడి సంతానం కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది.

సంతాన ఉత్పత్తి సమస్యలకు వాస్తు చిట్కాలు పాటించడం ఎంతో మంచిది.పెళ్లి జరిగిన జంట ఎప్పుడూ బెడ్రూంలో ఆగ్నేయ భాగంలో పడుకోవడం మంచిది.ఎందుకంటే అది అగ్ని మూలతో అనుసంధానించబడి ఉంటుంది.ఇది మంచి శృంగార జీవితాన్ని కలిగి ఉండేందుకు ఉపయోగపడుతుంది.

అందుకే గర్భం వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి.ఎప్పుడూ మీ తల దక్షిణం వైపు పాదాలు ఉత్తరం వైపు ఉండేలా నిద్రపోవాలి.

తల పడమర వైపు పాదాలు తూర్పు వైపు ఉండేలా చూసుకోవడం మంచిది.పడక గదిలోపల సానుకూల ఆకర్షణల వాతావరణం కల్పించడం మంచిది.

అందమైన ల్యాండ్ స్టెప్పులు, పెయింటింగ్ లు చిన్నపిల్లల ఫోటోలు ఉండేలా చూసుకోవడం ఎంతో మంచిది.

Telugu Bedroom, Flowers, Pregnancy, Vastu, Vastu Tips-Telugu Raasi Phalalu Astro

ఇంకా చెప్పాలంటే సువాసన గల పువ్వులను కూడా పడకగదిలో ఉంచడం ఎంతో మంచిది.మీ జీవిత భాగ్యస్వామిని గుర్తు చేసుకునే వస్తువులను కనిపించే చోట పెట్టుకోవడం కూడా మంచిదే.పడక గదిలో మీకు సంబంధించిన విషయాలు మాత్రమే చర్చించుకోవాలి.

గర్భిణీ స్త్రీలు వారి బిడ్డపై ఆశావాద ప్రభావాన్ని చూపుతూ ఉంటారు.కాబట్టి గర్భధారణ సమయంలో ప్రణాత్మక సినిమాలు చూడడం, మంచి పుస్తకాలు చదవడం మంచిది.

గర్భిణీలు రోజు ఈశాన్య దిశలో ధ్యానం చేయడం మంచిది.గర్భం కోసం పడక గది వాస్తు శాస్త్రానికి సంబంధించి పడకగదిలోని అనవసరమైన వస్తువులను తీసేయడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube