రోజురోజుకీ మారిపోతున్న దైనందిత జీవితంలో గుండెపోటు కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి.పెరిగిపోతున్న కాలుష్యం, కలుషితమైన ఆహారం నేడు మనిషి ఆరోగ్యమైన తీవ్రంగా ప్రభావం చూపుతోంది.
వయసుతో సంబంధం లేకుండానే పిల్లల నుంచి పెద్దల వరకు గుండెపోటుకు గురవుతున్నారు.కూర్చీలో కూర్చున్న వ్యక్తి, వాకింగ్ చేస్తున్న వ్యక్తి, వెహికల్ నడుపుతున్న వ్యక్తి, వ్యాయామం చేస్తున్నవారు అలా వున్నచోటినుండే గుండెపోటుకు గురై చనిపోయిన ఘటనలు ఈమధ్య కాలంలో అనేకమందిని చూస్తూ వున్నాం.
అయితే ఇలాంటి ఘటనల్లో కొన్ని సందర్భాల్లో బాధితుల్ని CPR చేసి కాపాడిన ఘటనలు కూడా మనం అనేకం చూశాం.తాజాగా అలాంటి సంఘటనే మరొకటి జరిగింది.రోడ్డుపై గుండెపోటు వచ్చిన వ్యక్తికి సరైన సమయంలో CPR చేసి ప్రాణాలు కాపాడింది ఓ మహిళా SI. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సదరు మహిళా పోలీస్ సమయస్ఫూర్తిని నెటిజన్లు ప్రశంసలతో కొనియాడుతున్నారు.
కాగా ఆ మహిళా SI పేరు సోనం పరషార్. రోజు చెకింగ్‌లో భాగంగా రోడ్డుపై విధులు ఆమె నిర్వహిస్తుండగా, సరిగ్గా అదే సమయంలో ఓ వ్యక్తి సడెన్‌గా గుండెపోటుకి గురిఅవడంతో వెంటనే అతని వద్దకు వెళ్లిన సోనం.అంబులెన్స్‌కు ఫోన్ చేసింది.
అయితే అతడు తీవ్రంగా ఇబ్బందిపడటం గమనించి CPR చేసింది.ఈలోగా అంబులెన్స్ రావడంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
సరైన సమయంలో CPR చేసి ఉండకపోతే ప్రాణాలు కాపాడటం చాలా కష్టం అయ్యేదని వైద్యులు తెలపగా ఆమెని అందరు ప్రశంసిస్తూన్నారు.ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం.