1.మల్లారెడ్డి కాన్వాయ్ పై దాడి.తలసాని రియాక్షన్
మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ పై నిన్న జరిగిన దాడిని మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు ఈ ఘటనకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని ఆయన వ్యాఖ్యానించారు.
2.రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం
టిఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర నేడు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
3.తెలంగాణకు వర్షాలు
రాగల మూడు రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
4.బిజెపిలో చేరిన టాలీవుడ్ నటుడు
సినీ నటుడు బాలాజీ బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర మీడియా కన్వీనర్ ఎన్.ఐజాక్ రాజ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు.
5.నా హత్యకు రేవంత్ కుట్ర : మల్లారెడ్డి
ఘట్కేసర్ లో జరిగిన ఎడ్ల సింహ గర్జన సభలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పై రెడ్డి కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడిన ఘటనపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు .తన హత్యకు రేవంత్ రెడ్డి కుట్ర పన్నారని ఆయన విమర్శించారు.
6.9.5 ఎకరాల్లో లే అవుట్.రేపు నోటిఫికేషన్
హైదరాబాద్ నగర శివారులోని హైదరాబాద్ నాగార్జున సాగర్ రోడ్డు వెంట తుర్కు యాంజల్ లో 9.5 ఎకరాల్లో హెచ్ఎండిఎ లే అవుట్ చేసింది.దీనికి రేపు నోటిఫికేషన్ జారీ కానుంది.
7.రైల్వే కోర్టుకు ముద్రగడ, మంత్రి దాడిశెట్టి
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మంత్రి దాడిశెట్టి రాజా సోమవారం విజయవాడ రైల్వే కోర్టుకు హాజరయ్యారు.2016 తుని లో రైలు దహనం ఘటన కేసులో విచారణ నిమిత్తం ముద్రగడ తో పాటు 42 మంది కోర్టుకు హాజరయ్యారు.
8.దక్షిణాది రాష్ట్రాల్లో కన్నా ఏపీ లోనే ధరలు ఎక్కువ : సిపిఐ
దక్షిణాది రాష్ట్రాల్లో కంటే ఏపీలోని ధరలు ఎక్కువ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.
9.అంబేద్కర్ జిల్లా వ్యవహారంపై చింతామోహన్ వ్యాఖ్యలు
అంబేద్కర్ పేరు ఒక చిన్న జిల్లాకు పెట్టడం కాదని, దక్షిణ భారతదేశానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ డిమాండ్ చేశారు.
10.జూన్ 1, 2 తేదీల్లో రాష్ట్ర స్థాయి చింతన్ శిబిర్
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లో జూన్ 1, 2 తేదీల్లో రాష్ట్ర స్థాయి చింతన్ శిబిర్ నిర్వహించనున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.
11.యూపీఎస్సీ సివిల్స్ 2021 తుది ఫలితాలు విడుదల
అఖిల భారత సర్వీసులు నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2021 ఫలితాలు విడుదలయ్యాయి.మొత్తం ఆరు వందల ఎనభై ఐదు మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది.
12.పులిని బందించేదుకు చర్యలు వేగవంతం
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం లో సంచరిస్తున్న పులిని బంధించేందుకు అటవీశాఖ ఏర్పాట్లు వేగవంతం చేసింది.
13.నేపాల్ విమాన ప్రమాదం.ప్రయాణికులంతా మృతి
నేపాల్ లో ఆదివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రయాణికులంతా మరణించినట్లు అధికారులు ప్రకటించారు.
14.అచ్చెన్న నాయుడు పై వైసీపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు
టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు పై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇకపై జగన్ గురించి ఎక్కువ మాట్లాడితే తాటతీస్తా అంటూ అచ్చెన్నాయుడు ని దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు.
15.ఏపీ ప్రజలను ఉద్దేశించి జగన్ ట్వీట్
ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టి నేటికీ మూడు సంవత్సరాలు అయింది ఈ నేపథ్యంలో ప్రజలను ఉద్దేశించి జగన్ సోషల్ మీడియా ద్వారా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
16.నేటి నుంచి ఆత్మకూరు ఉప ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ
నేడు ఆత్మకూరు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభించనున్నారు.జూన్ 6 నామినేషన్ కు చివరి గడువు.
17.ఫుట్ పాత్ బ్రిడ్జి ప్రారంభం
నేడు ఆమదాలవలస రైల్వే స్టేషన్ లో న్యూ బ్రిడ్జిని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించనున్నారు.
18.నేడు ,రేపు కేంద్ర మంత్రి విశాఖ పర్యటన
నేడు రేపు కేంద్ర మంత్రి సర్బానంద సానవాల్ విశాఖలో పర్యటించనున్నారు.
19.నేడు ప్రజా దర్బార్
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నేడు టిఆర్ఎస్ బిజెపి నేతల ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
20.విశాఖకు మంత్రి గుడివాడ అమర్నాథ్
దావోస్ పర్యటన ముగించుకున్న ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నేడు విశాఖ జిల్లాకు రానున్నారు.