రుచిగా తింటూనే వేగంగా బరువు తగ్గడం ఎలాగో తెలుసా?

ప్రస్తుత రోజుల్లో ఎంతో మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.బరువు తగ్గడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

 Do You Know How To Lose Weight Fast While Eating Deliciously Weight Loss Tips, W-TeluguStop.com

ముఖ్యంగా కడుపును మాడ్చుకుంటూ కఠినమైన డైట్ ను ఫాలో అవుతున్న వారు ఎంద‌రో ఉన్నారు.కానీ వాస్తవానికి రుచిగా తింటూ కూడా వేగంగా బ‌రువు తగ్గొచ్చు.

అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఓట్స్( Oats ).వెయిట్ లాస్ కు అద్భుతంగా సహాయపడతాయి.అయితే ఓట్స్ తో ఎన్నో రకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు.

ఓట్స్ లో పండ్ల ముక్క‌లు, నట్స్ కలిపి తీసుకోవచ్చు.ఓట్స్ తో దోశ, ఇడ్లీ, ఉప్మా వంటివి తయారు చేసుకుని తినొచ్చు.

గుడ్డు, పాలకూర( Egg , lettuce ).ఈ రెండు పోషకాలకు పవర్ హౌస్ లాంటివి.పైగా వెయిట్ లాస్ ఏజెంట్లుగా పని చేస్తాయి.గుడ్డు, పాలకూర కలిపి ఆమ్లెట్ వేసుకుని రోజు తినొచ్చు.ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడంత శక్తి లభిస్తుంది.రోగ‌ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.

అదే సమయంలో వేగంగా బరువు కూడా తగ్గుతారు.

Telugu Foods, Tips, Latest-Telugu Health

అలాగే రోజు ఒక కప్పు గ్రీన్ టీ( Green tea ) లో నిమ్మరసం కలిపి తీసుకోండి.తద్వారా క్యాలరీలు త్వరగా బర్న్ అవుతాయి.బరువు తగ్గడానికి ఇది ఒక ఉత్తమమైన డ్రింక్ గా చెప్పుకోవచ్చు.

మరియు టేస్టీ గా హెల్తీగా స్మూతీలు తయారు చేసుకుని తీసుకోవచ్చు.పైనాపిల్, బనానా, చియా సీడ్స్, బాదం పాల‌ను క‌లిసి బ్లెండ్ చేసుకుంటే మంచి స్మూతీ సిద్ధం అవుతుంది.

Telugu Foods, Tips, Latest-Telugu Health

ఈ స్మూతీ మంచి ఎనర్జీ బూస్టర్ పని చేస్తుంది.వెయిట్ లాస్ కు సూపర్ గా సహాయపడుతుంది.అలాగే ఒక కప్పు బొప్పాయి పండు ముక్క‌లు, అర కప్పు క్యారెట్ ముక్కలు, పావు టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, ఒక గ్లాస్ కొబ్బరి పాలు కలిపి బ్లెండ్ చేసుకోవాలి.ఈ స్మూతీ కూడా వెయిట్ లాస్‌కు హెల్ప్ అవుతుంది.

ఇలా బరువు తగ్గడానికి ఎన్నో రకాల స్మూతీలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube