పవిత్రమైన కార్తీక మాసంలో( karthika masam ) దీపం వెలిగించడం ఎంతో ముఖ్యమని పండితులు చెబుతున్నారు.అంతేకాకుండా దానధర్మాలు చేయడం కూడా అంతే ముఖ్యమని చెబుతున్నారు.
ఈ మాసంలో మీ శక్తి కొద్ది దానధర్మాలు చేయమని శాస్త్రాలు చెబుతున్నాయి.చేసే సహాయం చిన్నదైనా సరే మనస్ఫూర్తిగా, శ్రద్ధగా చేస్తే అధిక పుణ్యా ఫలితం లభిస్తుందని కూడా చెబుతున్నారు.
కార్తీకమాసం మొదలైన 11వ రోజు నుంచి 20వ రోజు వరకు ఏ దానాలు చేయడం వల్ల ఎలాంటి పాపాలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కార్తీక మాసంలో 11వ రోజు విభూది, పండ్లు( Vibhudi, fruits ) దక్షిణతో సహా దానం చేస్తే ఎంతో మంచిది.అలాగే పరమశివుడ్ని పూజిస్తే ధన ప్రాప్తి ఉన్నత పదవి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.12వ రోజు పరిమళ ద్రవ్యాలు, స్వయంపాకం, రాగి( Perfumery, copper ), దానం చేయడం చేసి, భూదేవి సమేత మహా విష్ణువును పూజిస్తే బంధ విముక్తి కలుగుతుందని చెబుతున్నారు.13వ రోజు మల్లెపూలు, జాజిపూలు వంటి పూలను దానం చేయడం ఎంతో మంచిది.అలాగే మన్మధుడిని పూజిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు.
కార్తీకమాసంలోనీ 14వ రోజు నువ్వులు, ఇనుము, పాడే గేదె దానం చేస్తే మంచిదని చెబుతున్నారు.అలాగే యమధర్మరాజుని పూజిస్తే అకాల మృత్యువులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

కార్తీకమాసంలో 15వ రోజు వరి అన్నం, భోజనం, వెండి దానం చేస్తే ఎంతో మంచిది.అలాగే చంద్రుని పూజిస్తే మనశ్శాంతి కలుగుతుందని చెబుతున్నారు.16వ రోజు నెయ్యి, సమిథలు, దక్షిణ, బంగారం దానం చేస్తే మంచిది.అలాగే అగ్నిదేవుని పూజిస్తే మంచి తేజస్సు లభిస్తుందని చెబుతున్నారు.
కార్తీకమాసంలో 17వ రోజు ఔషధాలు,డబ్బు దానం చేసి అశ్విని దేవతలని పూజిస్తే సర్వ వ్యాధులు తొలగిపోయి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.అలాగే కార్తీక మాసంలో 18వ రోజు పులిహోర, అట్లు, బెల్లం దానం చేస్తే చేసి గౌరీదేవిని ప్రార్థిస్తే అఖండ సౌభాగ్య ప్రాప్తి కలుగుతుందని చెబుతున్నారు.అలాగే 19వ రోజు నువ్వులు, కుడుములు దానం చేసి విగ్నేశ్వరున్ని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి విజయం లభిస్తుందని చెబుతున్నారు.20వ రోజు గోవు, భూమి, సువర్ణ దానాలు చేసి నాగులను పూజిస్తే గర్బదోష పరిహారం లభిస్తుందని చెబుతున్నారు.