భీమ్లానాయక్ సినిమాపై జగన్ కక్ష సాధింపు చర్యలు చేపట్టారు బుద్దా వెంకన్న

భీమ్లానాయక్ సినిమాపై జగన్ కక్ష సాధింపు చర్యలు చేపట్టారు,వివేకా హత్య కేసు నుంచి పక్కదారి మళ్లించడానికే ఈ కుట్రలు వివేకానంద హత్యకేసులో ఉన్న దోషులను తప్పించేందుకు అనేక కుట్రలు చేస్తున్నారు జగన్ తన పేరు ఎక్కడ బయటపడుతుందోనని భయపడుతున్నారు పులివెందులలో ఉన్న ప్రతి గడపకూ తెలుసు.భాస్కరెడ్డే చంపాడని, ఇందులో జగన్ కుట్ర ఉందని హత్య చేసిన వాళ్లే కాదు.

 Buddha Venkanna Comments On Ys Jagan About Bheemla Nayka Movie, Bheemla Nayka ,-TeluguStop.com

హత్యను ప్రోత్సహించిన వారు కూడా నిందితులే జగన్ కు తెలిసే వివేకానంద రెడ్డి హత్య జరిగింది సీబీఐకి ఇచ్చిన 15మంది సాక్షులు కూడా అవినాష్ రెడ్డి, అతని తండ్రి పాత్ర ఉందని నిర్ధారించారు జగన్ కూడా ఈ కేసులో ముద్దాయి కాబట్టి.ముఖ్యమంత్రిగా అనర్హుడు జగన్ సీఎం పదవికి రాజీనామా చేసి స్వతంత్రంగా సీబీఐ ముందు హాజరు కావాలి ఇప్పటి వరకు అవినాష్ రెడ్డిని సస్పెండ్ చేయపోగా, రఘురామకృష్ణరాజు ను తొలగించాలని లేఖలు రాస్తారా జగన్ కనుసన్నల్లో హత్యజరిగింది కాబట్టే.

అవినాష్ రెడ్డిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు జగన్ ది ఫ్యాక్షన్, కక్షపూరిత మనస్తత్వం.తన, మన అనే బేధం ఆయనకు లేదు వివేకా కుమార్తె పోరాటంతోనే సీబీఐ కేసు విచారణ చేపట్టింది అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డిలే చంపారని సాక్షులు చెప్పినా జగన్ స్పందించరా మీ చిన్నాన్న కుమార్తె కు మాత్రం అపాయిట్మెంట్ ఇవ్వరా.

అవినాష్ రెడ్డిని కాపాడతారా ఇదేనా మీ పాలన.హత్య చేసిన వారిని మీరే కాపాడతారా.

అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డిలను అరెస్టు చేస్తే జగన్ కుట్ర బయపడుతుందనే భయం పట్టుకుంది వివేకా హత్యకేసుపై మీడియా దృష్టిని మళ్లించేందుకే భీమ్లా నాయక్ సినిమాను వివాదం చేశారు ప్రతిపక్షాలను రాజకీయంగా ఎదుర్కోలేక ప్రతిపక్ష పార్టీల నేతలపై ఎదురుదాడి చేస్తున్నారు ఆఖరికి సీబీఐ పై కూడా కేసులు పెట్టించడం జగన్ దుర్మార్గానికి పరాకాష్ట.

జగన్మోహన్ రెడ్డి కి చిత్తశుద్ది ఉంటే సీఎంగా రాజీనామా చేసి.

సీబీఐ విచారణకు సహకరించాలి కొడాలి నానిని చూస్తే సన్నీళ్లతో స్నానం చేసినా.పంది నంది అవదనే విషయం గుర్తొస్తుంది కొడాలి నానీ.నువ్వు 420 కాదు.840 అనే విషయాన్ని గుర్తు పెట్టుకో ఎపీలో డేరా బాబా ఆశయాల సాధన కోసం అవతరించిన మరో ఆంధ్రా డేరా బాబా కూడా కొడాలి నానినే చంద్రబాబు పై మాట్లాడనని చెప్పిన నాని.మళ్లీ నోరు పారేసుకుంటున్నాడు నాని వ్యాఖ్యలకు మళ్లీ మరో సందర్భంలో తగిన విధంగా బుద్ది చెబుతాం నాగుల్ మీరా కామెంట్స్.వివేకా కేసు విషయంలో జగన్ తీరును చూస్తే.

అందరూ ఆశ్చర్యపోతున్నారు కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారు వివేకానందరెడ్డి అనే వ్యక్తి చాలా సౌమ్యుడని అందరికీ తెలుసు అన్న వైయస్ రాజశేఖరరెడ్డి సీఎం కావాలనే తపనతో నాడు పని చేశారు.

Telugu Ap Poltics, Avinash Reddy, Bheemla Nayka, Buddha Venkanna, Chandra Babu,

అటువంటి వివేకాను అత్యంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది దీనిపై సీఎం జగన్ సూటిగా సమాధానం చెప్పాలి వివేకా చనిపోయిన సమయంలో అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి, గంగిరెడ్డిలు వెళ్లారు రక్తపు మరకలు కడిగి, అక్కడ వాతావరణాన్ని ఎందుకు మార్చారు గుండె పోటుతో మరణించారని ప్రకటించడం వెనుక కారణం ఏమిటి ఆ తర్వాత జగన్ కూడా తన బాబాయిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలని జగన్ డిమాండ్ చేశారు నాడు సీబీఐ విచారణ కోరింది కూడా జగనే కదా చంద్రబాబు సిట్ వేస్తే.జగన్ సీఎం అయ్యాక ఐపీయస్ స్థాయి నుంచి డీఎస్పీ స్థాయికి విచారణను ఎందుకు మార్చారు సీబీఐ విచారణ కావాలని హైకోర్టులో వేసిన పిటీషన్ ను ఎందుకు వెనక్కి తీసుకున్నారు జగన్ సీఎంగా రెండున్నరేళ్ళలో వివేకా హత్య కేసు నిందితులను ఎందుకు పట్టుకోలేకపోయారు అంటే ఆ హత్య కేసులో ఎవరెవరి పాత్ర ఉందో, ఏం జరిగిందో జగన్ కు అన్నీ తెలుసు అయినా.చంద్రబాబు కుట్ర ఉంది, టీడీపీ నాయకులు చేయించారని జగన్ అసత్యాలు ప్రచారం చేశారు వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు లో పిటీషన్ వేశాక సీబీఐ విచారణ ప్రారంభమైంది 13మంది సాక్ష్యుల విచారణలో అవినాష్ రెడ్డి, వారి తండ్రి పాత్ర ఉందని సీబీఐకి చెప్పారు ఇప్పటికీ టీడీపీనే వెనక ఉండి నడిపిస్తుందని మాట్లాడుతున్న వైసీపీ నేతలకు అసలు సిగ్గుందా నీ సొంత చిన్నాన్న కేసునే చేధించలేని జగన్.

రాష్ట్ర ప్రజల మాన, ప్రాణాలను ఏవిధంగా కాపాడతారు ఇదేదో రాజకీయ లబ్ది కోసం కాదు మీ పాలనలో ఏం న్యాయం చేశారో చెప్పాలి సీబీఐ చెప్పిన అంశాలనే టీడీపీ నాయకులు ప్రస్తావిస్తున్నారు చంద్రబాబు, లోకేష్ చేయిస్తున్నారని అభాండాలు వేయడం దుర్మార్గం .

జగన్ సీఎం అయితే దోషులను పట్టుకుంటారని సునీత భావించారు ఇప్పుడు నిందితులనే కాపాడేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారు ఈ అంశాలను తెలుసుకునే సునీత ఒంటరిగా పోరాటం చేస్తున్నారు జగన్, అవినాష్ రెడ్డిల పాత్రపై చర్చ జరగకూడదనే భీమ్లా నాయక్ సినిమాను వివాదంగా మార్చుకున్నారు ఈ కేసులో ఉన్న వ్యక్తులను అరెస్టు చేస్తే జగన్ చిత్తశుద్ది ఏమిటో అందరికీ అర్దమవుతుంది ఒక్క తప్పును సమర్ధించుకునేందుకు జగన్ వంద తప్పులు చేస్తున్నారు.ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే.అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తారా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వమా.ఆటవిక రాజ్యంలో ఉన్నామా కుటుంబ వ్యవస్థలను కూడా గౌరవించలేని హీన స్థితిలో జగన్ ఉన్నారు రాష్ట్రంలో పరిస్థితులపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube