రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు, తమిళ భాషల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.తెలుగులో బిగ్ బాస్ షోకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తుండగా తమిళంలో మాత్రం శింబు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
కమల్ హాసన్ హోస్ట్ గా తప్పుకోవడంతో శింబు ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అయితే ఈ షో కోసం శింబు కళ్లు చెదిరే స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.
కాల్షీట్ల విషయంలో ఇబ్బందులు ఎదురుకావడంతో కమల్ హాసన్ ఈ షో నుంచి తప్పుకున్నారని బోగట్టా.తెలుగులో బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ఈ షో ప్రసారమవుతుండగా తమిళంలో మాత్రం బిగ్ బాస్ అల్టిమేట్ పేరుతో ఈ షో ప్రసారమవుతుండటం గమనార్హం.
ఈ షో కోసం శింబు ఎపిసోడ్ కు కోటి రూపాయల చొప్పున రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారని సమాచారం అందుతోంది.బిగ్ బాస్ షో ద్వారా శింబు భారీ మొత్తంలో సంపాదించనున్నారని తెలుస్తోంది.

మానాడు సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన శింబు ఓటీటీలో కూడా బిగ్ బాస్ షోతో సత్తా చాటాలని భావిస్తున్నారు.బిగ్ బాస్ షో ద్వారా శింబు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.తెలుగులో బిగ్ బాస్ షోకు హోస్టులు మారినా తమిళంలో మాత్రం కమల్ హాసన్ ఎక్కువ కాలం హోస్ట్ గా కొనసాగారు.ప్రస్తుతం శింబు కమల్ హాసన్ స్థానాన్ని భర్తీ చేయడం గమనార్హం.
శింబు బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉండటంతో ఆయన అభిమానులు కూడా చాలా సంతోషిస్తున్నారు. కోలీవుడ్ టాప్ హీరోల రేంజ్ లో బిగ్ బాస్ షో కొరకు శింబు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
అయితే శింబు తక్కువ ఎపిసోడ్లకే హోస్ట్ గా వ్యవహరిస్తారు కాబట్టి అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్వాహకులు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.







