టిడిపి చెట్ల సర్దుబాటు వ్యవహారం కొత్త తలనొప్పులు తెచ్చేలా కనిపిస్తోంది.ఇప్పటికీ 72 మంది అభ్యర్థుల పేర్లతో జాబితా సిద్ధమైనట్టు పేర్లతో సహా బయటకు వచ్చేసింది.
దాదాపు వంద మంది అభ్యర్థులు పేర్లతో జాబితాను టిడిపి అధినేత చంద్రబాబు సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.ఇంకా ఎన్నికలకు సమయం దగ్గరకు వస్తున్న తరుణంలో ముందస్తుగానే అభ్యర్థుల ప్రకటన చేయాలని బాబు చూస్తున్నాడు.
అయితే చాలాచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో సదభిప్రాయం లేకపోవడం… మరల వారికి టిక్కెట్ ఇస్తే గెలుపు అవకాశాలు తక్కువగా ఉంటాయని ఇంటలిజెన్స్ హెచ్చరికలతో చాలామంది తప్పించాలని బాబు చూస్తున్నాడు అయితే ప్రస్తుతం 72 మంది పేర్లతో బయటకు వచ్చిన జాబితా టిడిపి అధికారికంగా ప్రకటించకపోయినా… అప్పటికీ వాటిలో ఉన్న పేర్లు దాదాపుగా ఖాయం అని తెలుస్తోంది.
అవి కాకుండా వంద మంది అభ్యర్థుల పేర్లతో మొదటి విడత జాబితాను మరికొద్ది రోజుల్లోనే ప్రకటించేందుకు టీడీపీ అధినేత సిద్ధమవుతున్నాడు.గురువారం అర్ధరాత్రి వరకు బాబు సమీక్షలతో కడప జిల్లాతో పాటు అన్ని పార్లమెంట్ అభ్యర్థులను ఖరారు చేశారు.అలాగే మరికొన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు.
ఆ పేర్లు జాబితా చూస్తే….రాజంపేట చంగల్ రాయుడు, రాయచోటి రమేష్ కుమార్ రెడ్డి, రైల్వేకోడూరు నరసింహ ప్రసాద్, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పుంగనూరు అనుష రెడ్డి, కుప్పం చంద్రబాబు నాయుడు, చంద్రగిరి పులపర్తి నాని, పలమనేరు అమర్నాథరెడ్డి బరిలో ఉండగా.
నగరి శ్రీకాళహస్తి సీట్ల విషయంలో ఎటు క్లారిటీ తెచ్చుకోలేక పోతున్నాడు.
అదేవిధంగా మదనపల్లి తంబాలపల్లి నియోజకవర్గాల అభ్యర్థులను హోల్డ్ లో పెట్టారు.అలాగే… కడప నియోజకవర్గానికి వస్తే కడప ఎంపీ అభ్యర్థిగా మంత్రి ఆదినారాయణ పేరు ఖాయమవ్వగా…కడప అష్రాఫ్ (మాజీ మంత్రి అహ్మదుల్లా కొడుకు) మైదుకూరు సుధాకర్ యాదవ్, జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి, పులివెందుల సతీష్ కుమార్ రెడ్డి, కమలాపురం కొత్త నరసింహారెడ్డి, బద్వేలు లాజరస్ తోపాటు మరో పేరు పరిశీలనలో ఉన్నట్టు టిడిపి వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం.
అదేవిధంగా ప్రొద్దుటూరు నుంచి మరో నలుగురు రేస్ లో ఉన్నారట.అయితే చాలా చోట్ల కొత్తగా ముఖాలు తెర మీదకు వచ్చే సూచనలు కనిపిస్తుండడంతో సిట్టింగ్ ఎమ్యెల్యేల్లో గుబులు మొదలయ్యింది.దీనంతటికీ కారణం అవినీతి, ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఎదుర్కోవడమే కారణం అని తెలుస్తోంది.
అయితే టికెట్ రాని నాయకులు ఊరికే ఉంటారా అనేది మాత్రం డౌటే.