రైతులు పంటలలో అధిక దిగుబడులు సాధించడం కోసం మోతాదుకు మించి రసాయన ఎరువులను ఉపయోగిస్తున్నారు.సేంద్రియ ఎరువుల( Organic fertilizers ) పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు.
రసాయన ఎరువుల వల్ల అప్పటికప్పుడు దిగుబడి పెరిగిన, రసాయన ఎరువుల వల్ల నేల సారం క్రమంగా కోల్పోతూ చివరికి వ్యవసాయానికి పనికి రాకుండా పోతుంది.మరి రసాయన ఎరువుల వాడకాన్ని చాలా వరకు తగ్గించి సేంద్రియ ఎరువుల వల్ల పంటలు అధిక దిగుబడి సాధించాలంటే పచ్చి రొట్టె పైర్లతోనే సాధ్యం.
పంట వేసే ముందు నేలకు భూసార పరీక్షలు చేయించి, నేలకు అవసరమైన పోషకాలను సేంద్రియ ఎరువుల రూపంలో అందించాలి.సేంద్రియ ఎరువుల అంటే పశువుల ఎరువు వర్మి కంపోస్ట్ ( Vermi compost )లాంటివి.
వీటితోపాటు పచ్చి రొట్టె పైర్ల సాగుతో కూడా భూమి లో పోషకాల కొరతను తగ్గించవచ్చు.
తక్కువ ఖర్చుతో నేలకు సేంద్రియ పదార్థాన్ని ఎక్కువ మోతాదులో అందించాలంటే పచ్చి రొట్టె పైర్లతోనే సాధ్యం.నేలలో నీటి పోషకాలను నిలుపు చేసుకునే శక్తి పెరుగుతుంది.పంటలకు సిఫార్సు చేసిన నత్రజనిని 25% వరకు తగ్గించి వాడుకోవచ్చు.
జీలుగ, జనుము, పిల్లి పెసర, పెసర, అలసంద లాంటివి పచ్చి రొట్టె పైర్ల కిందికి వస్తాయి.పచ్చి రొట్ట పైర్ల పంటకాలం 60 నుంచి 70 రోజుల మధ్య ఉంటుంది.
పంట 45 నుంచి 50 రోజుల మధ్యలో పూత దశలో ఉన్నప్పుడు పంటను కలియదున్నాలి.ఆ తర్వాత పది నుంచి 15 రోజుల వ్యవధి పాటు ఆ పైరును కుళ్ళనిస్తే సేంద్రియ పదార్థంగా మారి పోషకాలు తర్వాత వేసిన పంటకు అందుబాటులోకి వస్తాయి.
ఊహించని రీతిలో భూసారం పెరుగుతుంది.ఇక దాదాపుగా రసాయన ఎరువుల వాడకం తగ్గించవచ్చు.క్రమంగా దిగుబడి పెరుగుతూనే ఉంటుంది.