యంగ్ రెబల్ స్టార్ కు ఫైర్ బ్రాండ్ స్వీట్ బర్త్ డే విషెస్.. పోస్ట్ వైరల్!

పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) నేడు 44వ పుట్టినరోజు ( Birthday ) వేడుకలను జరుపుకుంటున్నారు.ఇలా ప్రభాస్ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు ఈయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 Roja Special Wishes To Prabhas On His Birthday Special , Roja, Prabhas, Birthday-TeluguStop.com

అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ కి సంబంధించినటువంటి వివిధ రకాల ఫోటోలను షేర్ చేస్తూ తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.ఇకపోతే అభిమానులు మాత్రమే కాకుండా సినీ సెలబ్రిటీలు సైతం ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా తాను నటిస్తున్నటువంటి సినిమాలకు సంబంధించిన వరుస అప్డేట్స్ కూడా విడుదల చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు.ఇలా నేడు 44వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నటువంటి ప్రభాస్ కి ఫైర్ బ్రాండ్ ఏపీ టూరిజం శాఖ మంత్రి సినీనటి రోజా( Roja )ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ గతంలో తన కుమారుడితో కలిసి రోజా ప్రభాస్ తో దిగిన ఫోటోని షేర్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రోజా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ప్రియమైన ప్రభాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.మీ కలలన్నీ సహకారం కావాలని కోరుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా రోజా ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రోజా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ రాష్ట్ర రాజకీయాలలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు.

ఈ క్రమంలోనే ఏపీ టూరిజం శాఖ మంత్రిగా రోజా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube