మనం ఏదైనా సాధించాలి అనుకుంటే ఎటువంటి పరిస్థితులను అయినా ఎదురించగలం.కానీ చేతకాన్పుడే మనకు ఎన్నో రకాల కారణాలు దొరుకుతాయి.
అదే మనకు విజయమే ముఖ్యం అనుకుంటే చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టకుండా వాడుకుంటారు.అలా ప్రతి దాన్ని అవకాశం మలుచుకుని కష్టపడి జీవితంలో ఎదగాలనుకునే వారే విజయాన్ని సాధిస్తారు.
ఇప్పటికే ఈ విషయాన్ని ఎంతోమంది చేసి చూపించారు.అయితే చాలామందికి ఓ రైల్వే స్టేషన్ చదువు చెబుతోంది.
వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇదే నిజమండి బాబు.
బిహార్ రాష్ట్రంలోని సాసారం రైల్వే స్టేషన్ లో నిత్యం చదువుల జాతరే సాగుతుంది.
ఈ రైల్వే స్టేషన్ లో సాయంత్రం పూట వెళ్తే గనక ఇక్కడి ప్లాట్ ఫామ్ ల మీద వందలాది మంది యువత కనిపిస్తుంటారు.వీరంతా తమ భుజాన పుస్తకాలు వేసుకుని హడావుడిగా రైల్వే స్టేషన్‌కు వచ్చేస్తారు.
అయితే వారంతా ఏదో ఊరికి వెళ్లేందుకు రారు.ఆ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామల మీద చదువుకోవడానికి పెద్ద ఎత్తున స్టైడెంట్లు వస్తుంటారు.
ఇలా వచ్చే వారిలో ఎక్కువగా బ్యాంకింగ్ తో పాటుగా సివిల్ సర్వీసెస్ లాంటి పెద్ద జాబులకు ప్రిపేర్ అయ్యే వారే ఉంటారు.

మరి రైల్వే స్టేషన్‌కు ఎందుకు రావడం అనుకుంటున్నారా దీనికి కారణం ఏంటంటే రోహతాస్ జిల్లాలో ఇప్పటికి కూడా చాలా వరకు గ్రామాల్లో కనీసం రాత్రి పూట కరెంటు సదుపాయం లేకపోవడం గ్రామాల్లోని స్టూడెంట్లు, ఇలా రైల్వేస్టేషన్‌కు రావడం గతంలో స్టార్ట్ చేశారు.అలా రాను రాను ఈ రైల్వే స్టేషన్‌కు స్టూడెంట్ల తాకిడి పెరుగుతోంది.ఇక్కడ రోజుకు 24 గంటల చొప్పున 365 రోజులు నిత్యం విద్యుత్ సదుపాయం ఉండటంతో వారంతా ఇలా వస్తున్నారు.
ఇలా స్టూడెంట్లు వచ్చి చదువుకోవడం 2002 సంవత్సరంలోనే స్టార్ట్ అయింది.అప్పటి నుంచి ఇలా వస్తూనే ఉన్నారు.