వింటర్ లో రోజు మార్నింగ్ ఈ హెర్బల్ టీ తాగితే ఊహించని ఆరోగ్య లాభాలు మీ సొంతం!

ప్రస్తుత వింటర్ సీజన్లో సహజంగానే రోగ‌నిరోధక వ్యవస్థ బలహీన‌పడుతుంది.దీని కారణంగా జలుబు దగ్గుతో సహా ఎన్నో సీజనల్ వ్యాధులు చుట్టుముట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటాయి.

 If You Drink This Herbal Tea In Winter, You Will Have Unexpected Health Benefits-TeluguStop.com

అలాగే గుండెపోటు, బరువు అదుపు తప్పడం వంటివి ఎక్కువగా తలెత్తుతుంటాయి.అయితే వీటన్నిటికీ చెక్ పెట్టడంలో ఇప్పుడు చెప్పబోయే హెర్బల్ టీ అద్భుతంగా సహాయపడుతుంది.

వింటర్ సీజన్ లో ప్రతిరోజు మార్నింగ్ ఈ హెర్బ‌ల్ టీను కనుక తీసుకుంటే మీరు ఊహించని ఎన్నో ఆరోగ్య లాభాలు మీ సొంతమవుతాయి.

మరి ఇంతకీ ఆ హెర్బల్ టీ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? మరియు దాన్ని తీసుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటి.? వంటి విషయాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు మిరియాలు, రెండు యాలకులు, ఒక దాల్చిన చెక్క, ఒక అనాసపువ్వు, రెండు లవంగాలు వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Tips, Herbal Tea, Herbaltea, Latest-Telugu Health Tips

ఆ తర్వాత స్ట‌వ్‌ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్‌ వాటర్ పోయాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా దినుసులు, వ‌న్ టేబుల్ స్పూన్ అల్లం తురుము వేసి కనీసం ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ లో ఒక గ్లాస్ కొబ్బరిపాలు, రెండు టేబుల్ స్పూన్లు బెల్లం తురుము వేసి బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు వదిలేయాలి.అంతే మన హెర్బల్ టీ సిద్ధం.

ఐదు నిమిషాల అనంతరం స్టైనర్ సహాయంతో టీ ని ఫిల్టర్ చేసుకుని నేరుగా సేవించడమే.ఈ హెర్బల్ టీ చక్కటి రుచితో పాటు బోలెడన్ని పోషకాలను కలిగి ఉంటుంది.

వింటర్ సీజన్ లో ప్రతిరోజు మార్నింగ్ ఈ టీ ని తీసుకుంటే రోగ‌ నిరోధక వ్యవస్థ బ‌ల‌పడుతుంది.జలుబు దగ్గుతో సహా వివిధ ర‌కాల సీజ‌న‌ల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

అలాగే ఈ టీ ను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.చలిని తట్టుకునే సామర్థ్యం లభిస్తుంది.

వెయిట్ లాస్ అవుతారు.ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు దూరమవుతాయి.

మరియు మెదడు చురుగ్గా సైతం పనిచేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube