ఎండాకాలంలో( summer ) వేడి తాపాన్ని చల్లార్చి ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాన్ని చాలా మంది ప్రజలు తీసుకుంటూ ఉంటారు.తీవ్రమైన వేడితో అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.
అందుకే ఈ సమయంలో మంచి ఆహారాన్ని తీసుకోవాలి.మనం శరీరాన్ని డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి.
అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది.ఎండాకాలంలో సరైన ఆహారం తీసుకోకుంటే ఇది డిహైడ్రేషన్, పోషకాహారం లోపానికి దారి తీస్తుంది.
మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మీ ఆహారంలో చేర్చుకోగల అనేక ఆహారాలు ఉన్నాయి.ఎండాకాలంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సబ్జా గింజలు( Sabja seeds ) ఎంతగానో ఉపయోగపడతాయి.
ఈ వేసవిలో సబ్జా గింజలను ఎందుకు తీసుకోవాలి? దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే సబ్జా గింజలు వాటి పొడి బరువు నాలుగు రెట్లు వరకు నీటిలో పెంచుకుంటాయి.వాటి చుట్టూ జల్లి లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తాయి.ఈ హైడ్రోజెల్ ప్రాథమికంగా ఎలక్ట్రోలైట్స్ నీటికీ మూలం.
ఇది వేసవి చెమట సమయంలో మీరు కోల్పోయిన అన్ని పోషకాలను పునరుద్ధరిస్తుంది.ఆయుర్వేదం ప్రకారం సబ్జా గింజలు మీ ప్రేగులపై జీర్ణ క్రియ తర్వాత ప్రభావాన్ని తగ్గిస్తాయి.
ఎండాకాలంలో వేడి, అధిక సూర్యరశ్మి, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత( Sun exposure, electrolyte imbalance ) కారణంగా ఇది ప్రేగు కదలికలలో సమస్యలను కలిగిస్తుంది.అలాగే ఈ సమయంలో ఎక్కువగా ఎసిడిటీ సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
సబ్జా విత్తనాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ సమస్యలను నుంచి ఉపశమనం పొందవచ్చు.సబ్జా గింజల లో విటమిన్ ఇ, క్రోమియం వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.ఇవి మధుమేహన్ని అదుపు చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.ముఖ్యంగా ఎండాకాలంలో మొటిమల సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.సబ్జా గింజలు ఆకలిని అణిచి వేస్తాయి.
దీని వల్ల సులభంగా అధిక బరువును దూరం చేసుకోవచ్చు.ఇందులో ఉండే ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ కంటెంట్ కొవ్వును వేగంగా కరిగిస్తుంది.
అలాగే ఎండాకాలంలో మలబద్ధకం అనేది సాధారణ సమస్యగా ఉంటుంది.కానీ సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మీ ప్రేగు కదలికలు మెరుగుపడతాయి.
అందువల్ల మలబద్ధకాన్ని సులభంగా దూరం చేసుకోవచ్చు.