ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో కొత్త ఫీచర్.. దొంగలించిన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన కనిపెట్టే ఫీచర్..!

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్( Android smart phone ) లలో ఓ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే దొంగలించబడ్డ స్మార్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా కూడా చాలా సులభంగా కనిపెట్టొచ్చు.

 New Feature In Android Smart Phones.. Inventive Feature That Switches Off The St-TeluguStop.com

ఇంతకీ ఆ ఫీచర్ ఏంటో.ఆ ఫీచర్ ఎలా పనిచేస్తుందో అనే వివరాలు తెలుసుకుందాం.

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లలో “ఫైండ్ మై డివైజ్ నెట్ వర్క్( Find My Device ne twork )” అనే సరికొత్త ఫీచర్ ఏప్రిల్ ఏడవ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నట్లు గూగుల్ కంపెనీ తెలిపింది.

ఈ ఫీచర్ ద్వారా దొంగలించబడిన లేదంటే పోగొట్టుకున్న స్మార్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నా కూడా ఎక్కడ ఉందో చాలా సులభంగా కనిపెట్టవచ్చు.స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ ను చాలా అంటే చాలా సులభంగా లొకేషన్ ట్రాక్ చేయవచ్చు.ఒకవేళ స్మార్ట్ ఫోన్ లో చార్జింగ్ అయిపోతే, దాని చివరి లొకేషన్ ను ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఈ “ఫైండ్ మై డివైజ్ నెట్ వర్క్” ఫీచర్ తో ఆండ్రాయిడ్ ఫోన్లు, ట్యాబ్లెట్స్ తో పాటు వాటికి పెయిర్ చేసిన ఇయర్ బడ్స్, హెడ్ ఫోన్ లను కూడా ట్రాక్ చేసి కనిపెట్టవచ్చు.అంతేకాదు ఈ ఫీచర్ తో ఆండ్రాయిడ్ ఫోన్ తో లింక్ చేసి ఉన్న వాలెట్స్, కీస్, బైకుల జాడను కూడా కనిపెట్టవచ్చు.గతంలో స్విచ్ ఆఫ్ చేసిన స్మార్ట్ ఫోన్లను గుర్తించడం చాలా కష్టంగా ఉండేది.కేవలం స్విచ్ ఆన్ లో ఉండే స్మార్ట్ ఫోన్లను మాత్రమే గుర్తించే ఫీచర్స్ ఉండేవి.

ఈ లోపాన్ని అధిగమించడం కోసమే గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ప్రత్యేకంగా ఫైండ్ మై డివైజ్ నెట్ వర్క్ ఫీచర్ ను లాంఛ్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube