ముఖ్యంగా చెప్పాలంటే మైదా పిండి( Maida ) ఎలా తయారు చేస్తారో తెలిస్తే దాన్ని తినడమే మానేస్తారని నిపుణులు చెబుతున్నారు.గోధుమల నుంచి గోధుమ పిండి, జొన్నల నుంచి జొన్న పిండి రాగుల నుంచి రాగి పిండి వస్తుంది.
కానీ మైదా పిండి వేటి నుంచి వస్తుంది.మైదా పిండి ఎలా వస్తుంది? అది మన ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావం చూపుతుంది.ఈ విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్కసారి దీన్ని చదివితే మీకే అర్థమవుతుంది.
మిల్లులో బాగా పాలిష్ చేయబడిన గోధుమల నుంచి వచ్చిన అజోడికార్బోనమైడ్, క్లోరిన్ వాయువు మరియు బెంజాయిల్ పెరాక్సైడ్ అనే రసాణాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు.ముఖ్యంగా చెప్పాలంటే బెంజాయిల్ పెరాక్సైడ్ వాడుక చైనా, ఐరోపా దేశాల్లో నిషేధించబడింది.మైదలో అలోక్సాన్ అనే విషపురితమైన రసాయనం ఉంటుంది.
అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగానూ, చూడడానికి తెల్లగానే ఉంటుంది. దక్షిణ భారత దేశం( South India )లో మైదాపిండిని ఎక్కువగా ఉపయోగిస్తారు.
కొన్ని తపాలా కార్యక్రమాలలో కూడా కవర్లు అంటించడానికి, గోడల పై సినిమా పోస్టర్లు అంటించడానికి కూడా మైదా పిండినీ ఉపయోగిస్తారు.
ఇంకా చెప్పాలంటే మన దేశంలోనే చాలా మంది ప్రజలు మైదా పిండిని ఎన్నో రకాల ఆహార పదార్థాలలో ఉపయోగిస్తారు.అలాగే మైదాపిండిలో రవ్వ దోశ వంటి అట్లు, పరోటా, రుమాలీ రోటీ లాంటివి తయారు చేస్తారు.అలాగే కేక్స్, కాజాలు, హల్వా, జిలేబి మొదలైన మిఠాయిలు మరియు బొబ్బట్లు, బ్రెడ్ మొదలైన పిండి వంటకాలు చేస్తారు.
మైదాపిండి నిత్యం లేక అధికంగా వాడడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు రావడం, కిడ్నీలను రాళ్లు ఏర్పడడం వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.